Begin typing your search above and press return to search.
టీకా కొరత లేనప్పుడు..ఈ పరిమితులేంది మంత్రివర్యా?
By: Tupaki Desk | 7 April 2021 9:39 AM ISTకరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన మూడు రోజులుగా తొంభై వేలకు పైగా కేసులు నమోదవుతూ.. దేశ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. హద్దుఆపూ లేకుండా సాగుతున్న కరోనా కేసులతో వివిధ రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. మొన్నటివరకు లాక్ డౌన్ గురించి ఆలోచించని రాష్ట్రాలు సైతం.. ఇప్పుడు ఆ దిశగా ఆలోచనలు మొదలు పెట్టాయి. ఇప్పటికే మహారాష్ట్ర.. ఢిల్లీలో రాత్రి వేళల్లో కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఒకవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కేసులు సంఖ్య పెరిగిపోతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు మరింత పెరగకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. అయితే.. ఇందుకు వ్యాక్సినే కొరత ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్దన్ మాత్రం.. దేశంలో టీకాల కొరత లేదని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికలు.. రైతుల నిరసనలు.. పెళ్లి వేడుకలు.. ఇతర అవసరాలు కేసుల సంఖ్య పెరగటానికి కారణమైందని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8.4 కోట్ల మందికి టీకాలు వేశామని.. మంగళవారం ఒక్కరోజే 5.62 లక్షల మందికి టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. కరోనా టీకాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట నిజమే అయినప్పుడు.. 20 ఏళ్లకు పైబడిన అందరికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేయొచ్చు కదా? ఇప్పటివరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారం 45 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ఈ లెక్కన అందరికి టీకాలు ఇవ్వాలంటే ఏ ఆర్నెల్లో.. ఏడాదో పట్టే పరిస్థితి. దీనికి కారణం టీకాల కొరతగా చెబుతారు. కానీ.. మంత్రిగారు మాత్రం టీకాల కొరత లేనప్పుడు అందరికి అందబాటులోకి వ్యాక్సిన్ తీసుకొచ్చేయొచ్చుగా? మరి.. ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోనట్లు?