Begin typing your search above and press return to search.

ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రాదట .. అసలు నిజం చెప్పేసిన కేంద్రం !

By:  Tupaki Desk   |   14 Sep 2020 2:00 PM GMT
ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రాదట .. అసలు నిజం చెప్పేసిన కేంద్రం !
X
కరోనా ... కరోనా .. కరోనా .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు. ప్రపంచం మొత్తం కరోనా పేరు చెప్తే భయంతో వణికిపోతోంది. దీనితో అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారత్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇంతకు టీకా ఎప్పుడు వస్తుందని కేంద్రం చెబుతుంది,, అసలు ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ వస్తుందా అంటే ? కేంద్రం మాత్రం ఈసారి ఎలాంటి దాగుడుమూతలు లేకుండా కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. 2021 మొదటి త్రైమాసికంలోనే వ్యాక్సిన్‌ వస్తుందని ప్రకటించారు.

ఆన్ ‌లైన్‌ వేదికగా నిర్వహించిన సండే సంవాద్‌ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. దానికి వాలంటీర్‌ గా వ్యవహరిస్తానన్నారు. వ్యాక్సిన్ విడుదలైన వెంటనే మొదట ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యవసరం అయిన వారికి ఖర్చుతో సంబంధం లేకుండా పంపిణీ చేస్తామని చెప్పారు.దీన్ని బట్టి చూస్తే .. మరో ఆరు నెలలపాటు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు లేవు. ఈ ఏడాది చివరిలోగానే వ్యాక్సిన్‌ వస్తుందని అందరూ భావించారు. భారత్‌లో ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు ప్రయోగ దశలో ఉన్నాయి. ఆక్స్‌ ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తో పాటు భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశతో ఎదరుచూస్తున్నారు.

అయితే , కేంద్రం మాత్రం ఇప్పుడే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చింది. ఇక భారత్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 48 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే దూకుడు కొనసాగితే .. అమెరికాను కూడా దాటేస్తుంది. మరోవైపు లాక్‌ డౌన్‌ ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలించేశారు. స్కూళ్లు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అందరూ వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఆ అవకాశం లేదని తేలిపోయింది. ఇక , ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కూడా కొనసాగుతున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ దాని భారిన పడకుండా జాగ్రత పడటం తప్ప మన దగ్గర మరో ఆప్షన్ లేదు. కాబట్టి స్టే సేఫ్ ..స్టే హోమ్