Begin typing your search above and press return to search.

మోడీ ప్రక్షాళన: త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ?

By:  Tupaki Desk   |   11 Jun 2021 4:00 PM IST
మోడీ ప్రక్షాళన: త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ?
X
ప్రధాని మోడీ కేంద్ర కేబినెట్ ను పునర్వ్యస్థీకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు శాఖల వారీగా కేంద్ర మంత్రుల పనితీరుపై మోడీ సమీక్షలు నిర్వహిస్తున్నారట.. పనితీరు బాగా లేని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

మొన్నటివరకు కోవిడ్ మహమ్మారితో ఆపసోపాటు పడిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఆ తీవ్రత తగ్గడంతో ఇక పాలనపై దృష్టి సారిస్తోంది. కరోనా పరిస్థితులు కుదట పడడంతో ఇప్పుడు కేబినెట్ పై దృష్టిసారించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుదన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

ప్రధాని కొందరి శాఖలు మార్చుతారని.. ఇంకొందరిని కేబినెట్ నుంచి ఉద్వాసన పలకబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కొత్తవారికి అవకాశం ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

2019లో రెండోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు మంత్రివర్గ పునర్వ్యస్తీకరణ జరగలేదు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ముదే కేంద్రకేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారట.. యూపీ ఎన్నికలకు ముందు కేబినెట్లో మార్పులు చేసి ఆ ఎన్నికలను ఎదుర్కోవాలని ప్లాన్ చేశారట..