Begin typing your search above and press return to search.

సిరిసిల్ల లో కేటీఆర్ కు ఊహించని షాక్

By:  Tupaki Desk   |   25 Jan 2020 6:58 AM GMT
సిరిసిల్ల లో కేటీఆర్ కు ఊహించని షాక్
X
తెలంగాణ లో టీఆర్ఎస్ ఇప్పుడు తిరుగులేని రాజకీయ శక్తి. దాన్ని నడిపించేది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పైన ఆయన నాన్న అధినేత కేసీఆర్. అయితే పార్టీ బాధ్యతలన్నీ ఇప్పుడు కేటీఆరే చూస్తున్నారు. దీంతో గులాబీ పార్టీకి కర్తకర్మ క్రియ కేటీఆరే..

అలాంటి కేటీఆర్ ఇప్పుడు రచ్చ గెలవడం ఖాయం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంటోంది. కానీ రచ్చ గెలుస్తున్న కేటీఆర్ కు ఇంట మాత్రం షాకింగ్ ఫలితాలు కలవరపెడుతున్నాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం. అలాంటి చోట అంతా క్లీన్ స్వీప్ అనుకున్నారంతా.. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల వారు గులాబీ పార్టీలో చేరడంతో ఇక కేటీఆర్ ఇలాకా లో క్లీన్ స్వీప్ ఖాయమని అంచనాలు వేసుకున్నాయి.. అయితే తాజా ఫలితాలు కేటీఆర్ కు ఊహించని షాక్ ను ఇస్తున్నాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులు ఉండగా అందులో ఏకంగా 10 మంది స్వతంత్రులు గెలవడం కేటీఆర్ కు షాకింగ్ గా మారింది. టీఆర్ఎస్ గెలుపు కోసం కేటీఆర్ స్వయంగా ప్రచారం చేసినా ఈ పరిస్థితి రావడం గులాబీ పార్టీ ని కలవర పెడుతోంది.

సిరిసిల్ల మున్సిపాలిటీలో 39వార్డులకు గాను టీఆర్ఎస్ ఇందులో 24 వార్డులు గెలుచుకోగా.. ఇండిపెండెంట్లు 10 గెలవడం విశేషం. ఇక కాంగ్రెస్ 2, బీజేపీ 3 సీట్లు గెలుచుకొని ఖాతా తెరిచి టీఆర్ఎస్ కు షాకిచ్చాయి.

అస్సలు ఉనికి లోనే కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ రెండు చొప్పున సీట్లు సాధించడం.. ఇండిపెండెంట్లు ఏకంగా 10 సీట్లు గెలవడంతో మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేస్తానన్న గులాబీ చిన్న బాస్ కేటీఆర్ కు షాక్ తగిలింది. అంతిమంగా టీఆర్ఎస్ గెలిచినా ఇంత మంది రెబల్స్, కాంగ్రెస్, బీజేపీ ఖాతా తెరవడం మాత్రం కేటీఆర్ కు షాకింగ్ గా అనే చెప్పాలి.