Begin typing your search above and press return to search.
చైనాలో కొత్త పరిణామం ... ఆ ట్యాగ్ లైన్ కోల్పోతారేమో , ఏదంటే ?
By: Tupaki Desk | 27 May 2021 7:00 AM ISTచైనా .. ఈ పేరు చెప్తే ప్రపంచంలోనే ఏ దేశమైన కూడా వద్దురా బాబోయ్ అంటుంది. చైనా అనగానే అందరికి కరోనాయే గుర్తుకి వస్తుంది. కరోనా సృష్టించిన , సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. కరోనా విషయంలో ఇప్పటికీ ఆ దేశాన్ని ఆరోపణలు, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా డ్రాగన్ దేశంలో మరో ఆశ్చర్యకర పరిణామం జరగబోతోంది. మూడు నాలుగేళ్లలోనే తమకు మాత్రమే సొంతమైన ఓ ఘనతను చేజార్చుకోవాల్సి వస్తుందేమోనని ఆ దేశంలో గుబులు మొదలైంది. అదేమిటి అంటే .. చైనా అనగానే అత్యధిక జనాభా కలిగిన దేశం అని ఠక్కున గుర్తుకి వస్తుంది. ఇప్పుడు ఆ ట్యాగ్‌లైనే చైనా నుంచి చేజారబోతోందని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే వరుసగా మూడు నాలుగేళ్లు కొనసాగితే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ఘనతను భారత్‌కు ఇచ్చేయాల్సి రావొచ్చు.
ఒకప్పుడు మరణాల రేటు కంటే జననాల రేటు రెండు మూడింతలు ఉండేదట. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మరణాల రేటుకు, జననాల రేటుకు వ్యత్యాసం ఉంటోదని చైనా అధికారులు వాపోతున్నారు. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లు మాత్రమే. అదే భారత్‌లో ఇప్పటికే సుమారు 138 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే 2025 నాటికి అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్ సులభంగా దాటేస్తుందని నిపుణులు అంటున్నారు. 1953 నుంచి చూసుకున్నా గడిచిన నాలుగేళ్లలో చైనాలో జననాల రేటు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2010లో చైనా జనాభా 134 కోట్లు. 2021లో ఈ జనాభా 141కోట్లకు చేరింది. అంటే గడిచిన ఏడాదిలో దేశ జనాభా కేవలం 5.34శాతమే పెరిగింది. చైనా లో 15 నుంచి 59 మధ్య వసున్న వారు 89.43కోట్లు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 63.5శాతం. 60ఏళ్లు పైబడిన వారి శాతం కూడా గతంతో పోల్చుకుంటే 5.44శాతం పెరిగింది. వీరి శాతం దేశ జనాభాలో 26.4కోట్లు లేదా 18.7 శాతం అని తెలుస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చైనాకు కొంత ఊరటనిచ్చే విషయం ఈ దేశంలో 14 అంతకన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య 25.38 కోట్లు ఉంది.
ఇది దేశ జనాభాలో 17.95శాతం. చైనాలో ఇంతకు ముందున్న ఒక్క పిల్లాడు ముద్దు. ఇద్దరు పిల్లలు వద్దు’ అంటూ ఒక పిల్లాడికే అనుమతులిస్తూ చేసిన చట్టాన్ని సడలించడం కూడా బాలుర సంఖ్య పెరగడానికి దోహదపడిందనే చెప్పాలి. అయితే 1970 నుంచి అమల్లోకి వచ్చిన ఒకే బిడ్డ నిబంధన వల్ల 40కోట్ల మంది పుట్టకుండా ఆపినట్లు అధికారులు చెప్పారు. అయితే , 2027వ సంవత్సరం నాటికి దేశ జనాభా అత్యున్నత స్థాయికి చేరుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా, 2030 తర్వాత నుంచి చైనా జనాభా తగ్గిపోవడం మొదలవుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. కొందరు నిపుణులు మరో అడుగు ముందుకేసి వచ్చే ఏడాది నుంచే చైనా జనాభా తగ్గిపోవడం మొదలు కావొచ్చని అంటున్నారు. ఒక్క చైనాలోనే కాదు. చాలా ఆసియా దేశాల్లో జనాభా తగ్గుతున్న ట్రెండ్ కనబడుతోంది. గతేడాది దక్షిణ కొరియాలో చరిత్రలోనే అతిపెద్ద జనాభా తగ్గుదల నమోదయింది. అమెరికాలో కూడా ఇలానే జరుగుతోంది. ఇక్కడ జననాల రేటు రికార్డు స్థాయిలో 1.6శాతానికి చేరింది. ఇలా జనాభా తగ్గడం వల్ల సదరు దేశంలో ఆర్థిక వ్యవధి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లలు కనడం కోసం జంటలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించడం గమరార్హం.