Begin typing your search above and press return to search.

టీడీపీలో అనూహ్య మార్పు.. ఇంత‌కీ ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   2 Sept 2021 10:01 AM IST
టీడీపీలో అనూహ్య మార్పు.. ఇంత‌కీ ఏం జ‌రిగింది?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీలో అనూహ్య‌మైన మార్పు క‌నిపిస్తోంది. ఒక్క‌సారిగా.. రాష్ట్రంలో న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున ఒక ఉద్య‌మం మాదిరిగా.. పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు.. ఒకేద‌ఫా.. పార్టీ పుంజుకోవ‌డం.. ప్ర‌జ‌ల మ‌ధ్య రావ‌డం వంటివి చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. టీడీపీ ఒక‌ర‌కంగా.. కొంత నిరాశ‌లోకి కూరుకు పోయింది. నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ స్త‌బ్ధుగా మారిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఓట‌మిని జీర్ణించుకుని ముందుకు వ‌చ్చినా.. నాయ‌కులు పెద్ద‌గా క‌లివిడి ప్ర‌ద‌ర్శించలేదు.

ఏదో అంటీ ముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. స్థానిక స‌మ‌రంలోనూ.. పార్టీలో నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేద‌నే వాద న బ‌లంగా వినిపించింది. దీనికితోడు.. క‌రోనా ఎఫెక్ట్‌తో ఎవ‌రికి వారు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇదిలావుం టే.. ఈ మ‌ధ్య‌లో ఉన్న తిరుప‌తి ఉప ఎన్నిక నుంచి చంద్ర‌బాబు పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం ప్రారంభిం చారు. స్వ‌యంగా తానే హాజ‌రై.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం చేయ‌డం ద్వారా.. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో స్త‌బ్ధుగా ఉన్న నేత‌లు పుంజుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డో కొంద‌రు ఇంకా మాన‌సికంగా సిద్ధం కాలేదు. ఇక‌, ఇప్పుడు గ‌డిచిన వారం రోజులుగా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నాయి.

ఒక‌వైపు ఉత్త‌రాంధ్ర‌లో నేత‌ల‌ను అందిరినీ ఒకే తాటిపైకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మైంది. ఈ క్ర మంలోనే ఉత్త‌రాంధ్ర హ‌క్కుల విష‌యంలో.. చ‌ర్చా వేదిక నిర్వ‌హించారు. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లో ఉత్త రాంధ్ర విష‌యంలో ఎలా స్పందించాలి.. త‌మ హ‌యాంలో ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్త‌య్యేలా ప్ర‌భు త్వంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి.. అనే ప‌లు అంశాల‌పై నాయ‌కులు చ‌ర్చించారు. ఇదేస‌మ యంలో బ‌స్సు యాత్ర నిర్వ‌హించాల‌ని కూడా నాయ‌కులు నిర్ణ‌యించారు. నిజానికి ఇది మంచి ప‌రిణామ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, కోస్తాంధ్ర ప్రాంతానికి వ‌స్తే.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం రెండు రోజ‌లు ప‌ర్య‌ట‌న కోసం ఆయ‌న పోల‌వ‌రం ప్రాంతానికి వ‌చ్చారు. ఇక్క‌డి ప్రాజెక్టు నిర్వాసితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అదేస‌మ‌యంలో ఇత‌ర ప్రాంతాల్లోనూ ప‌ర్య‌టించి.. పార్టీ నేత‌ల‌తో మ‌మేక‌మ వుతారు. ముఖ్యంగా.. తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని పార్టీ నేత‌ల‌ను స‌మైక్య ప‌ర‌చ‌నున్నారు. ఇక‌, మ‌రోవైపు.. సీమ ప్రాంతానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా నేత‌లు దూకుడుగానే ఉన్నారు.


చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుమేర‌కు నాయ‌కులు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌పై దండెత్తారు. ఇక‌, ప్ర‌కాశం జిల్లా టీడీపీ నేత‌లు.. స్థానిక స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగానే స్పందిస్తున్నారు. ఇలా ఎటు చూసినా.. టీడీపీ నాయ‌కుల స్పంద‌న‌.. దూకుడు, గ‌త రెండున్న‌రేళ్ల కాలాన్ని మ‌రిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇదే దూకుడు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే.. ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.