Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వారిద్దరితో ఆమెకు ప్రాణహాని?

By:  Tupaki Desk   |   7 Nov 2020 10:30 AM IST
జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వారిద్దరితో ఆమెకు ప్రాణహాని?
X
ఏపీ అధికారపక్షంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తరచూ వార్తాంశాలుగా మారటమే కాదు.. ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. తాజాగా పార్టీ మహిళా ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే.. ఇద్దరుపార్టీ కార్యాకర్తల కారణంగా తనకు ప్రాణహాని ఉందన్న మాటను బహిరంగంగా చెప్పటమే కాదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం అధికారపక్షంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉండవల్లి శ్రీదేవి చేసిన తాజా ఆరోపణ కలకలంగా మారింది. సందీప్.. సురేశ్ అనే ఇద్దరు చట్టవిరుద్ధంగా మద్యం వ్యాపారం చేస్తూ.. పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో.. వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే..ఈ ఇద్దరిపై చర్యల వెనుక తాను ఉన్నట్లుగా భావిస్తూ.. తనను బెదిరిస్తున్నారని శ్రీదేవి వాపోయారు.

తన గొంతును ఇమిటేట్ చేయటం..మార్ఫింగ్ చేస్తూ.. తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. తన గొంతును మార్ఫింగ్ చేస్తూ తనను అవమానిస్తున్నారని.. బయటకు వెళ్లినప్పుడు ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారన్నారు. ఏపీ రాష్ట్రంలోని ఏ మహిళ పైనా ఈగ వాలనివ్వకుండా దిశ చట్టాన్ని తెచ్చిన జగన్ సర్కారులో.. అధికారపార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే.. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. ఉండవల్లి శ్రీదేవి పైన బాపట్ల పార్టీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేయటం గమనార్హం. ఇలాంటి వాటిపై సీఎం జగన్ ఫోకస్ చేసి.. సెట్ చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.