Begin typing your search above and press return to search.

బాబు తాపత్రయం బినామీల కోసమే !

By:  Tupaki Desk   |   21 Jan 2020 9:33 AM GMT
బాబు తాపత్రయం బినామీల కోసమే !
X
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం పై ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లు కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు రెండో రోజు కూడా సభలో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ చర్చలపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ..రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలన, అభివృద్ధి వికేంద్రికరణపై సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులపై వరాల జల్లు కురిపించిన వైఎస్‌ జగన్‌కు శ్రీదేవి అభినందనలు తెలిపారు. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. రాజధాని రైతులకు సీఎం జగన్‌ అండగా నిలిచారని తెలిపారు. జగన్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం లో జరిగేది రాజధాని మార్పు కాదు అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆమె స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం రాజధాని రైతులకు రూ. 2500 పెన్షన్‌ ఇచ్చి మోసం చేసిందని, కానీ మా ప్రభుత్వం మాత్రం భూముల లేని రాజధాని రైతులకు ఐదువేలు పెన్షన్‌ ఇస్తూ వారికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పట్టా భూముల కన్నా అసైన్డ్‌ భూములు కలిగిన రైతులకు ఎక్కువ అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అమరావతిని భ్రమరావతి చేశారని ఫైర్ అయ్యారు. రాజధాని పేరిట వందల కోట్లు తిన్న చంద్రబాబు నాయుడు.. ఇసుక ,వరదలు, డ్రోన్ అంటూ రాద్దాంతం చేసి నేడు అమరావతితో రాజకీయ లబ్ధి కోసం తాపత్రయ పడుతున్నారని మండి పడ్డారు. చంద్రబాబు బినామీల కోసం ధర్నాలు చేస్తున్నారని, బినామీల భూములు కోసం రైతుల ముసుగు లో అరాచాలకు పాల్పడుతున్నారని శ్రీదేవి మండిపడ్డారు.

చంద్రబాబు అసెంబ్లీలో కక్ష పూరిత చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అసైన్డ్‌ భూముల రైతులకు న్యాయం చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని , తుళ్లూరును కార్పొరేషన్ గా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యంతో పాటు ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలు, అమ్మ ఒడి,నాడు నేడు, మధ్యాహ్న భోజనం పథకoలో నూతన మెనూ విధానాలతో సీఎం ప్రజలకు మరింత చేరువయ్యారని ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు.