Begin typing your search above and press return to search.
జగన్ బాబాయ్ ఇంట్లో పొద్దున్నే అలా చేస్తారు.. ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 13 Jan 2021 9:10 AM ISTకాస్త ఆలస్యంగా స్పందించారు కానీ.. సరైన సమయంలో చాలామంది తెలుసుకోవాల్సిన విషయాల్ని వెల్లడించారు మాజీ ఎంపీ.. సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. గతంలో ఎప్పుడూ లేనంత దారుణమైన సామాజిక అంశాల్లో ఏపీ ప్రజలు చిక్కుకొని ఉన్నారు. కులం.. మతం ఆధారంగా రాష్ట్ర ప్రజల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో చోటు చేసుకునే అంశాలు కూడా దోహదపడేలా చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఇటీవల తరచూ జరుగుతున్న హిందూ దేవతామూర్తుల ధ్వంసం చేయటం ఒక ఎత్తు అయితే.. కులం.. మతాన్ని తరచూ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజల మధ్య అపనమ్మకాల్ని పెంచుతున్న వేళ.. ఉండవల్లి చాలా ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. చరిత్రలోతుల గురించి తెలిసిన వారికి ఆయన చెప్పిన కొన్ని విషయాలు తెలిసినా.. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన కొత్త విషయాల్ని వెల్లడించారు.
ఏపీలో డొక్క శుద్ధి ఉన్న కొద్ది మంది నేతల్లో ఉండవల్లిని ఒకరిగా చెప్పాల్సిందే. అలాంటి ఆయన.. వివేకానందుడి జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అసలు దేశంలోకి క్రిస్టియన్ మిషనరీస్ ను రమ్మని చెప్పిందే వివేకానందుడని చెప్పిన ఆయన.. అలాంటి పరిస్థితి ఎందుకన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పేశాడు. మతం ఆధారంగా దేశాన్ని రెండు ముక్కులు చేసిన మహ్మద్ అలీ జిన్నా తాత రాజ్ ఫుట్ అని.. అలాంటి ఆ కుటుంబంలో జిన్నా లాంటి ముస్లిం ఎందుకు వచ్చాడో చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. వైఎస్ తాత ఇంట్లోక్రిస్టియానీటికీ ఉండే ప్రాధాన్యం.. అదే సమయంలో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో హిందుమతాన్ని ఎంత బలంగా నమ్ముతారో చెప్పటంతో పాటు.. వారి కుటుంబాల్లో ఉన్న వైరుధ్యం.. అందులోని విలక్షణత.. సౌందర్యాన్ని తనదైనశైలిలో చెప్పుకొచ్చారు. సమాజంలో అంతకంతకూ మతతత్త్వం పెరిగిపోతున్న వేళ.. ఉండవల్లి ప్రస్తావించిన అంశాల్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మాటల్ని వింటే.. మనల్నిమనం ఎంతా చెడగొట్టుకుంటున్నామో ఇట్టే అర్థమవుతుంది.
- నేను రాష్ట్రంలో ఉండే అన్ని గుళ్లకు తరచూ వెళుతుంటా. ఆరుసార్లు అయ్యప్పమాల వేసుకొని.. రెండు సార్లు మాల మేయకుండానే పంబ వెళ్లా. ఈ రోజు (జనవరి 12) స్వామి వివేకానందుడి పుట్టినరోజు. ‘నేను అన్ని మతాలను గౌరవిస్తా. చర్చి , మసీదులకు వెళతాను` అని వివేకానంద చెప్పాడు .ఇండియాకు వచ్చి సహాయం చేయాలి’ అని క్రిస్టియన్ మిషనరీస్‌ను వివేకానందుడు.. అమెరికా వెళ్లిన సమయంలో కోరారు.
- మతం అంటే నమ్మకం. అన్ని మతాలను గౌరవించాలని వివేకానందుడు చెప్పాడు. ఎవరెవరు ఏ దేవుడిని పూజించాలో.. ఆ దేవుడిపై భక్తి కలిగించేది నేన` అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. హిందువుల్లో అగ్రకులాల వారు.. వెనకబడిన కులాలను చిన్నచూపు చూడటం వల్లే.. వారు క్రిస్టియానిటీవైపు వెళ్లారు. ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. మత మార్పిడులు జరగడం లేదు.
- నిజం చెప్పేవాడే బ్రాహ్మణుడు. కర్మను బట్టి వర్ణం ( బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ). అంతే కానీ.. జన్మను బట్టి కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ల తాత క్రిస్టియానిటీ తీసుకున్నారు. కానీ.. ఆయన హిందూ దేవాలయాలకు వెళతారు. అక్కడ పూజారులు చెప్పిన ప్రకారం పూజలు చేస్తారు.
- జగన్ బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నన్ను మించిన హిందువు . ఆయన భార్య.. గోమాతకు పూజ చేసి కానీ... రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించదు. వాళ్ల సిస్టర్ విజయమ్మ బైబిల్ చదువుతారు. అదే వారి కుటుంబంలో గొప్పదనం. హిందుత్వ అనే పుస్తకం రాసిన వీర్ సావర్కర్‌కు దేవుడంటే నమ్మకం లేదు.
- మహమ్మద్ అలీ జిన్నా పూర్వికులు హిందువులు. వాళ్ల తాత పేరు ప్రేమ్‌జీ భాయ్ ఠక్కర్ ఓ రాజ్‌పుట్, వాళ్ళు అంతా శాకాహారులు. అయితే టక్కర్ చేపల వ్యాపారం చేసేవారు. అందుకే.. ఆయన్ని ఆ కులం నుంచి వెలేశారు. తరువాత అయన మనో వేదనతో మరణించారు. ఆ కోపంతో.. జిన్నా వాళ్ల నాన్న ఇస్లాం స్వీకరించారు. మనల్ని మతం నుంచి వెలేసినప్పుడు.. వేరే మతంలోకి చేరడం చాలా కామన్.
- ప్రపంచంలో ఎక్కువ మంది ఆచరించేది క్రిస్టియానిటీ. తరువాత ఇస్లాంను అనుసరిస్తారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తనను తాను హెచ్చించుకున్నవాడు.. తగ్గించబడును` అని జీసస్ క్రిస్ట్ చెప్పారు.
- రైల్లో గొడ్డు మాంసం రవాణా చేస్తున్నారని మొన్నామధ్య కొంత మందిని చంపేశారు. బీఫ్ ఎగుమతుల్లో మనదేశం మూడో స్థానంలో ఉంది. బీఫ్ ఎగుమతులను అరికట్టకుండా ఆరేళ్లుగా మోడీ ఏం చేస్తున్నాడు?
- ప్రతి సీఎం మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటాడు. కాబట్టి మత మార్పిడులు.. మత కలహాలను ప్రోత్సహించడు. ఆలయాలపై దాడులు సహించడు.జగన్ ఎలాంటి మత మార్పిడులు చేయడం లేదు. మతం ఎవరూ ఊరికే మారరు. కాబట్టి మత మార్పిడులు అనేది తప్పు
- సీఎం, హోం మినిస్టర్, డీజీపీలు క్రిస్టియన్లు అనడం చంద్రబాబు తప్పు. తిరుపతి ఉపఎన్నికల కోసం.. భగవద్గీత కు , బైబిల్‌కు , కృష్ణుడికి జీసస్ కు పోటీ అని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇది చాలా తప్పు. ఎవరో.. ఆలయాలపై దాడులు చేస్తుంటే.. రాజకీయాల కోసం బీజేపీ పాకులాడుతోంది.