Begin typing your search above and press return to search.
మార్గదర్శి, రామోజీరావు.. ఉండవల్లి సంచలన నిజాలు
By: Tupaki Desk | 7 Feb 2020 2:37 PM ISTబలమైన మీడియా చేతిలో ఉంది. సృష్టించుకున్న వేల కోట్ల సామ్రాజ్యం అండ ఉంది. ప్రభుత్వాలను సైతం కూల్చగల సామర్థ్యం ఉంది. నాడు ఎన్టీఆర్ ను కూలదోసి చంద్రబాబును గద్దెనెక్కించాడన్న ఆరోపణలు మీడియా మొఘల్ రామోజీరావు సొంతం.. మోడీ నుంచి కేసీఆర్, చంద్రబాబు దాకా అందరినీ మేనేజ్ చేయగల పెద్దాయన రామోజీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది మాత్రం రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పవచ్చు. నాడు ముఖ్యమంత్రి గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయం లో ఆయన అండతో రామోజీ పై యుద్ధం చేసిన ఉండవల్లి తాజాగా రామోజీ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఉండవల్లి అరుణ్ కుమార్.. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. ఈయనను రాజమండ్రి ఎంపీగా పోటీచేయించి గెలిపించింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తనకు వైఎస్ గాడ్ ఫాదర్ అని ఉండవల్లి ఎప్పుడూ చెబుతుంటారు. కేవీపీ, వైఎస్ కు అప్పట్లో ఎంతో ఆప్తుడుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండేవారు... వైఎస్ ను వ్యతిరేకించిన రామోజీని టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టారు.. మార్గదర్శి చిట్ ఫండ్ పై ఉండవల్లి పోరాటం.. వైఎస్ అండగా తెరవెనుక అరుణ్ కుమార్ రాజకీయం గురించి కథలు కథలుగా చెబుతారు.
తాజాగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చేతిలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు అనడానికి మార్గదర్శి కేసు ఉదాహరణ అని.. ఇలాంటి నేరాలు చేసిన వారిలో రామోజీరావు తప్పించి మిగిలిన వారంతా జైల్లో ఉన్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మార్గదర్శి విషయంలో రామోజీరావు తప్పు చేశారని.. తాను దీనిపై కేసు వేసినా.. హైకోర్టుకెక్కినా కూడా రామోజీరావు మేనేజ్ చేసి తప్పించుకున్నాడని ఉండవల్లి సంచలన ఆరోపణలు చేశారు. 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై మార్గదర్శి కేసును కోర్టు కొట్టివేసిందన్నారు. దీనిపై తాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకం గా కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వాలు, పట్టించుకో లేదన్నారు.
ఈ గొడవ మొత్తం సీఎం జగన్ కు తెలిసి ఉండాలని.. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించ లేదని ఉండవల్లి ఆరోపించారు. రామోజీ కింద కోర్టులో ఒకలా.. పైకోర్టు లో మరోలా వాదించారని.. రామోజీకి, మార్గదర్శికి సంబంధం లేదని వాదించి తప్పించుకున్నారన్నారు.
చంద్రబాబుకు శ్రీకృష్ణ పరమాత్మ అయిన రామోజీపై జగన్ చర్యలు తీసుకుంటారని అనుకున్నానని.. కానీ ఆయన ఏం చేయకపోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు.
2005లో రామోజీరావు పై తమకు ఫిర్యాదు అందిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి సైతం తన ఆత్మకథలో చెప్పారని.. మార్గదర్శి వివరణపై ఆర్బీఐ సైతం సంతృప్తి చెందలేదని.. ఇంత జరిగినా రామోజీ ఎటువంటి కేసులు ఎదుర్కొకుండా తప్పించుకున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. ఇలాంటి నేరాలు చేసిన వారిలో రామోజీరావు తప్చించి మిగతా వారంతా జైల్లో ఉన్నారంటూ ఉండవల్లి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.