Begin typing your search above and press return to search.

ఉండవల్లి వైరల్ లెక్క... ఎన్టీవోడి సరసన జగన్

By:  Tupaki Desk   |   21 Oct 2019 9:58 AM IST
ఉండవల్లి వైరల్ లెక్క... ఎన్టీవోడి సరసన జగన్
X
ఏంటేంటీ... తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం అందుకుని తెలుగు దేశం పార్టీని స్థాపించి తెలుగు నేల రాజకీయాలను శాసించిన నందమూరి తారకరామారావు సరసన వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరారా? నమ్మకం కుదరట్లేదా? అయితే సీనియర్ రాజకీయవేత్త - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వినిపించిన కొత్త లెక్కను చూస్తే... నిజమేనని నమ్మక తప్పదు. తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఉండవల్లి ఏది చెప్పినా... తార్కికంగానే ఉంటుంది. అసలు ఉండవల్లి చెప్పే మాటకు కౌంటర్ ఇవ్వాలంటే మహామహులకే సాధ్యం కాదు. అలాంటి ఉండవల్లి నోట వచ్చిన కొత్త లెక్క... జగన్ ను ఎన్టీవోడి సరసన నిలబెట్టేసింది.

ఆ లెక్క ఏమిటో మనమూ చూద్దాం పదండి. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఉండవల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఉండవల్లి సమాధానం ఇస్తూ.. ఎన్టీఆర్ అంత చరిష్మా ఉన్నోడు అని చెప్పాడు. 175 అసెంబ్లీ - 25 ఎంపీ సీట్లకు గాను జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ - 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది కదా. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 51 శాతం ఓట్లు పడ్డాయి. ఇది సాధారణ విషయం మాత్రం కాదు. అందుకే ఎన్నికలు ముగిసిన చాలా రోజులకు బయటపెట్టిన ఉండల్లి... జగన్ గొప్పతనాన్ని చాలా గ్రేట్ గానే చెప్పేశారు. ఇలా ఏ ఎన్నికలో అయినా ఒక పార్టీ 51 శాతం ఓట్లు సాధిస్తే... అది రికార్డే. ఆ రికార్డు గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు - ఆ తర్వాత ఎన్టీ రామారావులకు మాత్రమే సాధ్యమైంది.

నాడు పీవీకి - ఎన్టీఆర్ కు సాధ్యమైన ఈ ఫీట్ ను ఇప్పుడు జగన్ సాధించేశారన్న మాట. అందుకే జగన్ ను ఉండవల్లి... పీవీ - ఎన్టీఆర్ ల సరసన నిలబెట్టేశారు. నాడు పీవీ - ఎన్టీఆర్...ఇప్పుడు జగన్ కు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్... జాతీయ స్థాయిలో ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదని తేల్చేశారు. చివరకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు కూడా సాధ్యం కాని విషయాన్ని కూడా ఉండవల్లి గుర్తు చేశారు. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి నాలుగు వందల సీట్లు వచ్చినా... కాంగ్రెస్ పార్టీకి ఇంత శాతం ఓట్లు రాలేదని గుర్తుచేశారు.