Begin typing your search above and press return to search.
పెంచిన జీతాలు మాకొద్దంటూ సమ్మె నోటీసు ఇవ్వటం ఉండవల్లికి సర్ ప్రైజ్ గా ఉందట
By: Tupaki Desk | 24 Jan 2022 5:00 PM ISTసీనియర్ రాజకీయ నేత.. మాజీ ఎంపీ.. రాజకీయ విశ్లేషణుకుడు.. అదే పనిగా నోటికి పని చెప్పకుండా బుద్ధి బలంతో మాట్లాడే కొద్ది మంది తెలుగు నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. తాజాగా ఆయన ఏపీలోని పరిణామాలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య నడుస్తున్న పీఆర్సీ లొల్లి మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నడుస్తున్న వివాదంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీ వివాదం విషయంలో తానెప్పుడూ చూడని పరిస్థితుల్ని చూస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.
తాజా పరిణాలపై ఆయనో ప్రకటనను తాజాగా విడుదల చేశారు. అందులో.. ''కొత్త పీఆర్సీ అమలుతో రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంటుంటే.. 'మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు పాత జీతాలే చాలు' అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు. జీతాలు పెంచాలంటూసమ్మెలు చేయటం చూశాను కానీ పెంచిన జీతాలు మాకొద్దు అంటూ సమ్మె నోటీసు ఇవ్వటం బహుశా ఇదే ప్రధమం అనుకుంటా'' అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు.. సమ్మె నోటీసు ఇవ్వటాన్ని ఆయన తప్పు పట్టారు. 'ఒక పక్క కరోనా బీబీత్సం.. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని పరిగణలోకి తీసుకొని సమ్మెను ఆపాల్సిందిగా ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యకు పరిష్కారం సాధించాలని ప్రార్థన' అంటూ పేర్కొన్నారు. ఉండవల్లి లాంటి మేధావికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్న ఉద్యోగుల డిమాండ్ లోతుల్లోకి వెళితే.. వాళ్లు ఎందుకు ఆ డిమాండ్ చేస్తున్నారో కూడా అర్థమవుతుంది కదా? మేధావి ఉండవల్లి ఆ పని కూడా చేసి.. ప్రభుత్వం చెబుతున్న వాదన.. ప్రభుత్వ ఉద్యోగులు వినిపిస్తున్న వాదనల్ని విని.. తెలుగు ప్రజలకు ఒక మాట చెబితే బాగుంటుంది కదా? మరి.. ఆ పని చేస్తారా?