Begin typing your search above and press return to search.
నమ్మలేని క్రైం.. 12 ఏళ్ల క్రితం హత్య.. కానీ బతికే ఉంది
By: Tupaki Desk | 19 Sept 2020 6:00 AM ISTవినేందుకు విచిత్రంగా అనిపించే ఫేక్ మర్డర్ ఉదంతమిది. చట్టాన్ని కళ్లు గప్పి.. పోలీసుల్ని పక్కదారి పట్టించటమే కాదు.. అమాయకుల్ని నేరస్తులుగా చిత్రీకరించి.. జైల్లో మగ్గేలా చేసిన షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. యూపీలో వెలుగు చూసిన ఈ ఉదంతం చూస్తే.. ఇలాంటివి రియల్ లైఫ్ లో సాధ్యమేనా? అన్న సందేహం కలుగక మానదు. ఇంతకూ ఏం జరిగిందంటే..
యూపీలోని జలౌన్ జిల్లాలోని కల్పి ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల అమ్మాయి పన్నెండేళ్ల క్రితం (2008) మిస్ అయ్యింది. తన కుమార్తె కనిపించటం లేదని ఆ అమ్మాయి తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల అనంతరం కాన్పూర్ జిల్లాలోని ఘటం పూర్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ దొరికింది.
దీంతో పోలీసులు.. మిస్ అయిన అమ్మాయి తల్లికి ఆ డెడ్ బాడీని చూడటం.. తన కుమార్తె అని ఆమె చెప్పటంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లైంది. విచారించిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎలా గుర్తించారంటే.. కనిపించకుండా పోయిన బాలిక తల్లి ఇచ్చిన పోలీసు కంప్లైంట్ లో పేర్కొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారిని జైలుకు తరలించారు. కొద్దికాలం క్రితం హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరు మరణించారు కూడా.
ఇదిలా ఉండగా.. తాజాగా ఒక నేత ఇచ్చిన కంప్లైంట్ తో అలెర్టు అయిన పోలీసులు.. హత్యకు గురైనట్లుగా చెప్పిన అమ్మాయిని గుర్తించారు. ప్రస్తుతం ఆ యువతికి 26 ఏళ్లు. మర్డర్ అయిపోయిందని భావించిన ఆమె.. ఎంచక్కా పెళ్లి చేసుకొని జీవిస్తోంది. మరి.. మిస్ అయిపోయినట్లుగా సదరు యువతి తల్లి ఎందుకు కంప్లైంట్ చేసినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ కేసును మరోసారి లోతుగా దర్యాప్తు చేస్తే తప్పించి.. అన్ని విషయాలు బయటకు వచ్చేలా లేవు. చేయని నేరానికి నేరస్తులుగా ముద్ర పడిన వారికి త్వరలోనే..ఈ కేసు నుంచి ఉపశమనం లభించొచ్చని చెబుతున్నారు.