Begin typing your search above and press return to search.

వెన్నులో వణుకుపుట్టిస్తోన్న యూఎస్ నివేదిక 2050 నాటికీ నీరు దొరకని వారు ఎంతమంది ఉంటారంటే ?

By:  Tupaki Desk   |   24 March 2021 12:30 AM GMT
వెన్నులో వణుకుపుట్టిస్తోన్న యూఎస్ నివేదిక 2050 నాటికీ నీరు దొరకని వారు ఎంతమంది ఉంటారంటే ?
X
నీరు .. ఈ భూ ప్రపంచం పై ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి అత్యంత అవసరమైనది. ముఖ్యంగా మానవుడికి. అయితే , అలాంటి నీరు భూమి పై ఉంటే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా , ఎక్కడో అంగారక గ్రహంపై నీటి జాడలను కనుగొనడానికి మానవుడు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడు అనే విషయాన్ని ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2021 చాలా స్పష్టంగా అడుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నీటిని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీటిని ఎందుకు విలువైనదిగా చూడటం లేదు, ఎందుకు నీటి విలువను తక్కువగా అంచనా వేస్తున్నారు , నీటిని తక్కువ అంచనా వేస్తే జరిగే పరిణామాలను అంచనా వేయడం కూడా కష్టమే అంటోంది ఆ నివేదిక. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచ నీటి అభివృద్ధి నివేదికను తాజాగా విడుదల చేశారు.

మంచి నీటికి చాలా మంది విలువ ఇవ్వడం లేదు. దాని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నీటి వృధా చేయడం సరైన చర్య కాదు అంటూ యూఎన్ వాటర్ విభాగం చైర్మన్ గిల్బర్ట్ తెలిపారు. ఓవైపు నీటి కోసం పెరుగుతున్న డిమాండ్, మరోవైపు రోజు రోజు వేడెక్కుతున్న భూమి. ఫలితంగా సామాన్య ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నీటిని వృథా చేయడం వలన కలిగే నష్టాలేంటో ఒకసారి చూస్తే ...

యూఎన్ ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2021 ప్రకారం నీటి గురించి 10 వాస్తవాలు..

1. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో నలుగురికి సరిపడా సురక్షితమైన తాగునీరు దొరకడంలేదు. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో సగానికి పైగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని, అందుబాటులో ఉన్న నీటి వనరులను మించి జనాభా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.

2. నీటి సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలలో 2 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఒక నెలపాటు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాల్లో 4 బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారట.

3. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు పిల్లలలో ఒకరికి వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత నీరు అందుబాటులో ఉండటం లేదు. ఇంకా 80 కంటే ఎక్కువ దేశాలలో పిల్లలు అధిక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారట.

4. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో అటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు అత్యధికంగా ఉన్నారు. 58% మంది ప్రతిరోజూ తగినంత నీటి సౌలభ్య పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

5. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఇద్దరు, లేదా 3 బిలియన్ల మందికి ఇంట్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి నీటి సౌకర్యం లేదు. ఇందులో పేద దేశాలలో దాదాపు మూడొంతుల మంది.

6. 140 తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం కల్పించడానికి సంవత్సరానికి 114 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే సురక్షితమైన నీటి కొరత ఏర్పడటం వలన కలిగే సామాజిక మరియు ఆర్ధిక పరిస్థితులను అంచనా వేయడం కష్టం.

7. గత 100 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. 1980 ల నుండి సంవత్సరానికి 1% చొప్పున పెరుగుతూనే ఉంది.

8. ప్రపంచ నీటి ఉపసంహరణలో వ్యవసాయం దాదాపు 70% ఉంది. ప్రధానంగా నీటిపారుదల కోసం మాత్రమే కాకుండా పశువులు, ఆక్వాకల్చర్ కోసం కూడా నీటిని ఉపయోగిస్తున్నారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ నిష్పత్తి 95% వరకు ఉంటుంది.

9. వాతావరణంలో కలిగే మార్పులు కూడా నీటి లభ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

10. ఐస్ కవర్లు, హిమానీనదాలను కరగడం, ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉందని, భవిష్యత్‌లో వందల మిలియన్ల మందికి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చని చెబుతున్నారు యూఎన్ అధికారులు.

కాబట్టి ఈ నివేదికని పరిగణలోకి తీసుకొని నీటిని పొదుపుగా వాడుకోకపోతే , రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకోలేక ఎంతోమంది మృత్యువాత పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా నీటిని పొదుపుగా వాడుకోవడం మంచిది. అలాగే ఇంకుడు గుంతలు తీయడం కూడా నేర్చుకోవాలి.