Begin typing your search above and press return to search.

కిమ్ బాంబు పేలింది.. ఐరాస ఒణికింది!!

By:  Tupaki Desk   |   4 Sep 2017 9:56 AM GMT
కిమ్ బాంబు పేలింది.. ఐరాస ఒణికింది!!
X
అటు ఐక్య‌రాజ్య‌స‌మితి ఆదేశాలు, ఇటు అంత‌ర్జాతీయ దేశాల ఆందోళ‌న‌లు అయినా కూడా వీటినేమీ లెక్క‌చేయ‌కుండానే ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ దూకుడు సాగిస్తున్నారు. తాజాగా హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షించ‌డం ప్ర‌పంచ దేశాల‌తోపాటు ఐక్య‌రాజ్య‌స‌మితిని సైతం ఒణికించింది. ప్ర‌యోగించిన ప్రాంతంలో భూమి 6.8 తీవ్ర‌త‌తో కంపించ‌డం కూడా అంద‌రినీ ఖిన్నుల‌ను చేసింది. దీంతో కిమ్ విష‌యం తేల్చేయాల‌ని, ఏ అండ చూసుకుని కిమ్ అలా బ‌రితెగిస్తున్నాడో చూడాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి భావించింది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ఉదయం అత్యవ‌స‌రంగా భ‌ద్ర‌తా మండ‌లి భేటీ నిర్వ‌హించింది.

ఈ భేటీలో అమెరికాతోపాటు జపాన్‌ - ఫ్రాన్స్ యూకే - దక్షిణ కొరియాలు పాల్గొన్నాయి. ఉత్తర కొరియా అణు పరీక్ష పై చర్చ‌కు సిద్ధ‌మ‌య్యాయి. వ‌ద్ద‌ని వారిస్తున్నా కిమ్ ఎందుకు ఇలా చేస్తున్నారో దృష్టి పెట్టాయి. ఇక‌, ఇదే విష‌యాన్ని ఐక్య రాజ్య సమితిలో రాయబారి నిక్కీ హలె తన ట్విట్టర్‌ లో ధృవీకరించారు. అమెరికా స‌హా మిత్రపక్షాల జోలికి వస్తే భారీ సైనిక చర్యకు దిగాల్సి ఉంటుందని ఉత్త‌ర కొరియాకు తేల్చి చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. సైనిక చ‌ర్య‌కు దిగితే.. ఉత్త‌ర కొరియాకు క‌లిసి వ‌చ్చే దేశాలు దాదాపు దూర‌మైపోతాయ‌ని, అప్పుడు ఆ దేశం చివురుటాకులా వ‌ణ‌క‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. కాగా, ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిందేనని భద్రతా మండలికి బ్రిటీష్ ప్రధాని థెరెసా విజ్ఞప్తి చేశారు.

నిజానికి ఉత్త‌ర కొరియా భార‌త్‌కు మిత్ర దేశంతో స‌మానం. అలాగ‌ని ఎలాంటి స్నేహ‌పూర్వ‌క స‌హ‌కారం లేదు. కానీ, వ్యాపార, వాణిజ్యం విష‌యంలో ఈ దేశానికి, భార‌త్ కు గ‌ట్టి సంబంధాలు ఉన్నాయి. అనేక ఎగుమ‌తుల‌కు ఉత్త‌ర‌కొరియా కేంద్రం. అయినా కూడా తాజా హైడ్రోజ‌న్ బాంబు ప్ర‌యోగంపై భారత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అణ్వాయుధాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి కొరియా పెద్ద తప్పు చేసిందంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది.