Begin typing your search above and press return to search.

సీరం అగ్ని ప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన ఐరాస !

By:  Tupaki Desk   |   22 Jan 2021 11:00 AM GMT
సీరం అగ్ని ప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన ఐరాస !
X
కరోనా మహమ్మారిని అంతం చేసే కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ ను తయారుచేస్తున్న పుణెకు చెందిన సీరం ఇన్‌ స్టిట్యూట్‌ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టెర్మినల్ 1 గేట్ వద్ద ఉన్న బిల్డింగ్‌ లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు.

సీరం ఇనిస్టిట్యూట్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం తీవ్ర విచారకరమని, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని ఐరాస చీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేసినట్లు సెక్రటరీ జనరల్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదం వల్ల వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండదని సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా స్ఫస్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు.. సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతోన్న వెల్డింగ్‌ పనులే ప్రమాదానికి కారణమని ప్రాధమిక అంచనాకి వచ్చారు. ఈ ప్రమాదం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తూ మహారాష్ట్ర సర్కార్.