Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేయండి.. రష్యన్ సైనికులకు వారి భార్యల సలహా

By:  Tupaki Desk   |   14 April 2022 10:37 AM GMT
ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేయండి.. రష్యన్ సైనికులకు వారి భార్యల సలహా
X
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా దాన్ని రెండు నెలలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే దేశాన్ని హస్తగతం చేసుకోని రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లో మారణహోమాన్ని సృష్టిస్తున్నారు.

ప్రజలను కాల్చిచంపడం.. అలాగే మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తాజాగా ఆధారాలు లభించాయి అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. రష్యా సైనికుల అత్యాచారాల పరంపరకు వారి భార్యలు కూడా అనుమతించిన దారుణాలు వెలుగుచూశాయి.

ఉక్రెయిన్ లో యుద్ధం నెలకొనడంతో లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. అక్కడ కూడా వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో ఉన్న మహిళలపై కూడా రష్యన్ సైనికులు అత్యాచారం చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లోని ఒక ఇంట్లో ప్రవేశించి.. ఆమె కుమారుడిని పక్క గదిలో పెట్టి అత్యాచారం జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది.

తాజాగా ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ రష్యన్ సైనికులు తమ భార్యలతో మాట్లాడిన కాల్స్ ను ట్రాప్ చేసింది. దానిలో ఒక సైనికుడు.. అతడి రష్యాలో ఉన్న భార్య మాటలు రికార్డ్ అయ్యాయి. అవిప్పుడు వైరల్ గా మారాయి.

ఒక రష్యా సైనికుడు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. అందులో నిన్ను చాలా మిస్ అవుతున్నానని భార్యతో చెబుతాడు. దానికి ఆమె నవ్వి.. 'అక్కడ ఉక్రెయిన్ మహిళలు అందంగా ఉంటారు కదా.. నాకు తెలుసు.. కావాలంటే నువ్వు వారిని అత్యాచారం చేసుకో..కానీ ఆ విషయం నాకు మాత్రం చెప్పొద్దు' అని నవ్వుతూ అంటుంది.

దానికి ఆ సైనికుడు.. 'నేను ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేసింది చెప్పొద్దు అంటావ్ అంతేనా?' అని అడుగుతాడు. దానికి అతడి భార్యనవ్వుతూ 'సరే.. యువతులను అత్యాచారం చేసుకో.. కానీ కండోమ్ ధరించి చేయండి' అని జాగ్రత్తలు కూడా చెబుతుంది. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల అత్యాచారాల పరంపరకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది.