Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: రష్యా భయానికి అన్ని దేశాలు హ్యాండిచ్చాయ్.. ఒంటరయ్యాం

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:32 AM GMT
#RussiaUkrainewar: రష్యా భయానికి అన్ని దేశాలు హ్యాండిచ్చాయ్.. ఒంటరయ్యాం
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ముదిరింది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. ఉక్రెయిన్ లోని రాజధానితోపాటు కీలక పట్టణాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఉక్రెయిన్ సైన్యానికి చెందిన 74 టార్గెట్లను ఛేదించినట్టు రష్యా ప్రకటించింది.

తొలి రోజు రష్యా ధాటికి ఉక్రెయిన్ కు చెందిన 11 ఎయిర్ ఫీల్డ్స్, 18 రాడార్ స్టేషన్లు, మూడు కమాండ్ పోస్టులను ధ్వంసం అయ్యాయి. ఎస్300, బీయూకే ఎం1 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థ సహా ఉక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక పోస్టులపై బాంబుల వర్షాన్ని కురిపించినట్లు పేర్కొంది. పలు మిలటరీ హెలిక్యాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చినట్టు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి కొనషెన్కోవ్ తెలిపారు. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.

రష్యా చేతిలో పూర్తిగా ఓడిపోయే పరిస్థితి తలెత్తడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. తన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. రష్యాతో తాము ఒంటరిగా పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒంటరిగా పోరాడడానికి భయపడట్లేదని పేర్కొన్నారు. ఇతర దేశాల సహాయ, సహాకారాలు లేకుండా తమ దేశాన్ని తాము కాపాడుకుంటామని.. సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.

రష్యాను నిలువరించడానికి ఆ దేశాన్ని ఢీకొట్టడానికి తమతో కలిసి వచ్చే దేశాలు ఏవీ కనిపించట్లేదని వ్లాదిమర్ అన్నారు. తమతో కలిసివచ్చే వారు ఎవరూ ఉన్నారని.. అలా వచ్చే వారెవరూ తమకు కనిపించడం లేదని వ్లాదిమర్ స్పష్టం చేశారు.

రష్యాకు అందరూ భయపడుతున్నారని.. నాటోలో తమ దేశానికి సభ్యత్వం ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. దీనికి ఎవరూ ముందుకు రావట్లేదని చెప్పారు. అన్ని దేశాలు ముందు అభయం ఇచ్చి ఇప్పుడు అందరూ భయపడుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు.

రష్యా సైనికులు ఇప్పటికే తమ దేశంలో ప్రవేశించి విధ్వంసకారుల ముసుగులో అల్లర్లు సృష్టిస్తున్నారని వ్లాదిమర్ ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారన్నారు. తాను దేశం విడిచి వెళ్లినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. తాను ఎక్కడికి వెళ్లలేదని వ్లాదిమర్ అన్నారు. తనను ఛేదించడమే రష్యా మిలటరీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిని లొంగదీసుకొని మానసికంగా బలహీన పరచడమే రష్యా వ్యూహం అని అది సాధ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.