Begin typing your search above and press return to search.

రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి

By:  Tupaki Desk   |   31 March 2022 6:30 AM GMT
రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి
X
యుద్ధం మొదలైన దాదాపు నెల రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్ దళాలు రష్యాపై ఎదురుదాడి చేశాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు 19 కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలోనే ఉన్న బెల్గెరోడ్ ఆయుధ డిపోపై ఉక్రెయిన్ దళాలు బాంబులతో మోత మోగించాయట. ఆయుధ డిపోపై బాంబులు కురిపించటంతో మొత్తం డిపో ధ్వంసమైపోయింది. రష్యన్ ఆయుధ డిపోపై ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ల సాయంతో బాంబులు కురిపించాయి.

యుద్ధం మొదలైన నెల రోజుల్లో రష్యా సైన్యం దాడుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఉక్రెయిన్ నానా అవస్థలు పడుతోంది. అలాంటిది ఇక ఎదురుదాడికి అవకాశమే లేకుండా పోతుంది. రెండు రోజుల క్రితం రాజధాని కీవ్ చుట్టూ మోహరించిన రష్యా కాన్వాయ్ పైన ఉక్రెయిన్ డ్రోన్లతో బాంబులు కురిపించి భారీ నష్టం చేసింది. ఈ దాడిలో సుమారు 40 మంది రష్యా సైనికులు చనిపోవటమే కాకుండా పదుల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, ఇతర యుద్ధ వాహనాలకు భారీగా నష్టం జరిగింది.

ఇది జరిగిన రెండురోజుల్లోనే రష్యాలోని ఆయుధ డిపోపైన ఉక్రెయిన్ సైన్యం బాంబులు కురిపించటం సంచలనంగా మారింది. అంటే రష్యా సైన్యాన్ని ఒకవైపు కాచుకుంటునే మరోవైపు ఎదురుదాడులు మొదలుపెట్టిందని అర్ధమవుతోంది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే రెండుదేశాల మధ్య ఒకవైపు యుద్ధ విరమణకు టర్కీలోని ఇస్తాంబుల్ లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు రెండుదేశాలు ఒకదానిపై మరొకటి బాంబులు కురిపించుకుంటునే ఉన్నాయి.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఉక్రెయిన్ లోని అనేక నగరాలపై రష్యా బాంబులు కురిపిస్తునే ఉంది. ఇప్పటికే చాలా నగరాలు బాంబుల దెబ్బకు నామరూపాలు లేకండా పోయాయి. ప్రతి నగరంలోను సుమారు 50 శాతంకు పైగా ప్రాంతాలు ధ్వసమైపోయాయి.

దాదాపు 50 లక్షల మంది ఉక్రెయిన్ నుండి పోలండ్, రష్యా లాంటి దేశాలకు వలసలు వెళ్ళిపోయారని ఐక్య రాజ్యసమితే ప్రకటించింది. అయితే ఈ సంఖ్య దాదాపు కోటివరకు ఉండచ్చని సమాచారం.