Begin typing your search above and press return to search.

మాల్యా కు లండన్ కోర్టు షాక్ - ఇక ఇండియాకు రాక తప్పదు

By:  Tupaki Desk   |   8 April 2019 12:17 PM GMT
మాల్యా కు లండన్ కోర్టు షాక్ - ఇక ఇండియాకు రాక తప్పదు
X
మాల్యా పారిపోయింది 2016లో. తన కంపెనీల వ్యాపార నిర్వహణకు కార్పొరేట్ గ్యారంటీతో తీసుకున్న వేల కోట్ల రూపాయలు కట్టలేనని ఎగవేసి లండన్ కు 2016లో మోడీ పారిపోయాడు. అతని పట్ల బీజేపీ ప్రభుత్వం నత్త నడక దర్యాప్తు కొనసాగించింది. అయితే... ఇన్నాళ్లకు అతను అష్టదిగ్బంధనం అయ్యాడు. త్వరలో ఇండియాకు రానున్నాడు. సరిగ్గా ఎన్నికల ముందు అతడిని ఇండియాకు రప్పించడం చూస్తుంటే... అతను బీజేపీ ఎన్నికల వ్యూహంలో ఒక ప్రచారక్ అయిపోయినట్లు అర్థమవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...

పారిపోయి లండన్లో ఉంటున్న విజయ్‌ మాల్యా ను ఇండియాకు రప్పించడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మాల్యాను భారత్‌ కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు. అయితే... ఇప్పటివరకు ఏదో విధంగా తప్పించుకుంటూ వస్తున్న మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌ కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ ను లండన్‌ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను తీసుకురావడానికి ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.

విజయ్ మాల్యా అయిదు వేల కోట్లు అప్పు తీసుకుంటే... అది వడ్డీలు కలిపి 9 వేల కోట్ల రూపాయలకు పైగా జమయ్యింది. ఇవన్నీ కట్టకుండా ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి డీఫాల్టర్‌ అయ్యాడు. 2016 మార్చిలో లండన్‌ కు పారిపోయాడు. అప్పట్నుంచి కసరత్తు చేసిన కేంద్రం... గత ఆరు నెలలుగా వేగంగా పెంచింది. ఎన్ినకల సమయంలో మాల్యాను ఇండియాకు రప్పించగలిగితే బీజేపీ ప్రభుత్వానికి మైలేజీ వచ్చే అవకాశం ఉంది. బహుశా అందుకే ఈ కేసును ఇటీవల బాగా ఫాలో అప్ చేస్తున్నారు.