Begin typing your search above and press return to search.

రెండో సారి క్వారంటైన్ ‌లో యూకే ప్రధాని!

By:  Tupaki Desk   |   16 Nov 2020 1:00 PM IST
రెండో సారి క్వారంటైన్ ‌లో యూకే ప్రధాని!
X
కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతుంది. సెకండ్‌ వేవ్‌ వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు. సెకండ్‌ వేవ్ ‌లో అమెరికాలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే.. తాజాగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే ఒకసారి కరోనా బారిన పడిన ఆయన, మళ్లీ మహమ్మారి సోకుతుందనే భయంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు . ప్రధానిని కలిసిన చట్టసభ్యుల బృందంలోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లీ అండర్సన్ ‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో ముందుజాగ్రత్త చర్యగా బోరిస్ జాన్సన్ సెల్ఫ్ ఐసోలేషన్‌ లోకి వెళ్లారు. కరోనా రోగిని ప్రధాని కలిసిన నేపథ్యంలో ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బోరిస్ ఈ ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి బారినపడి వైద్యుల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న బోరిస్ మళ్లీ బాధ్యతల్లో బిజీగా మారారు. తనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ క్వారంటైన్‌లోకి వెళ్తున్నాని, నిబంధనల ప్రకారం 10 రోజుల పాటు ఇంటి నుంచే పరిపాలనను కొనసాగిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.