Begin typing your search above and press return to search.

బఫూన్.. పిచ్చోడన్నారే కానీ బ్యాన్ చేయల

By:  Tupaki Desk   |   19 Jan 2016 1:40 PM GMT
బఫూన్.. పిచ్చోడన్నారే కానీ బ్యాన్ చేయల
X
ముస్లింల పేరు ఎత్తితే చాలు అంతెత్తున ఎగిరే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగాలని తహతహలాడుతున్న డోనాల్డ్ ట్రంప్ యవ్వారంపై బ్రిటన్ పార్లమెంటులో భారీగా చర్చ జరిగింది. అమెరికాలోకి ముస్లింలను అడుగు పెట్టకుండా తాత్కలికంగా నిషేధం విధించాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ను బ్రిటన్ లోకి అడుగు పెట్టనీయకుండా శాశ్వితంగా నిషేధించాలన్న డిమాండ్ పై ఇప్పటికే ఆన్ లైన్లో 5 లక్షల మంది సంతకాలు చేసిన నేపథ్యంలో పార్లమెంటులో చర్చ జరిగింది.

బ్రిటన్ లో తనపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ట్రంప్ ఆ మధ్య మాట్లాడుతూ.. తనపై నిషేధం విధిస్తే.. తాను పెట్టిన పెట్టుబడుల్ని బ్రిటన్ నుంచి ఉపసంహరించుకుంటానని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన పార్లమెంటు.. ఆయన్ను బఫూన్ గా.. పిచ్చోడిగా విమర్శలు చేశారే కానీ.. ఆయన్ను బ్రిటన్ లోకి అడుగు పెట్టనీయకుండా చూడాలన్న అంశంపై మాత్రం ఎంపీల్లో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు.

మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆయన పెట్టుబడులు ఎక్కువగా పెట్టిన స్కాట్ లాండ్ ప్రాంతానికి చెందిన ఎంపీలు ట్రంప్ మీద మరింతగా చెలరేగిపోయారు. ట్రంప్ మీద జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేసిన ఎంపీల్లో స్కాట్ లాండ్ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే.. ట్రంప్ మీద విమర్శలు చేసినా.. ఆయనపై వేటు వేసే విషయంలో మాత్రం బ్రిటన్ పార్లమెంటు నిర్ణయం తీసుకోలేదు. ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలుసు. లేనిపోయింది ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడు అయితే కష్టం కదా. అందుకే ముందుచూపుతో వ్యవహరించినట్లున్నారు.