Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ పై యూకే పత్రిక ఆసక్తికర కథనం
By: Tupaki Desk | 1 Sept 2020 11:45 AM ISTఇదిగో వచ్చేస్తుంది. అదిగో వచ్చేస్తుందంటూ అప్పుడప్పుడు మీడియాలో హడావుడి నెలకొనటం.. కరోనా వ్యాక్సిన్ పై వార్తలు రావటం తెలిసిందే. ఆ మధ్యన ఆగస్టు 15 నాటికి భారత్ లో వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ ఎంత హడావుడి జరిగిందో తెలిసిందే. అయితే.. ఇందులో వాస్తవం ఎంతన్నది తర్వాత తేలింది. ఇదిలా ఉంటే.. తాజాగా యూకేకు చెందిన మీడియా సంస్థ.. కరోనా వ్యాక్సిన్ పై కొత్త కథనాన్ని అచ్చేసింది.
సదరు కథనం ప్రకారం కరోనా వ్యాక్సిన్ ప్రయోగానికి సంబంధించి ఫలితానికి చాలా దగ్గర్లో వారు వచ్చినట్లుగా పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై నూట పదికి పైగా ప్రయోగాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగాల్లో అందరి చూపులు కొన్ని సంస్థల పైనే ఉన్నాయి. అలాంటి సంస్థల్లో ఒకటి ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీపై సానుకూల అంచనాలు ఉన్నాయి.
తాజాగా వారు వ్యాక్సిన్ కనిపెట్టే అంశానికి సంబంధించి చాలా దగ్గరగా వచ్చారని చెబుతున్నారు. మరో ఆరు వారాల్లో వ్యాక్సిన్ తయారీలో సక్సెస్ కావటం ఖాయమంటున్నారు. ఈ వ్యాక్సిన్ రావటంతో ప్రపంచంలో అనూహ్యమైన మార్పులకు తెర తీయనున్నట్లు చెబుతున్నారు. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టే సామర్థ్యం ఈ వ్యాక్సిన్ కు ఉందంటున్నారు.
ఓపక్క వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న మాట వినిపిస్తుంటే.. మరోవైపు కరోనా రెండోసారి విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందన్న మాట వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో శీతాకాలం రానున్న వేళ.. వ్యాక్సిన్ కానీ రాకుంటే.. తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. రెండోసారి కరోనా విరుచుకుపడితే.. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని.. అదే జరిగితే జరిగే నష్టం అపారంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.మరి.. యూకే మీడియా సంస్థ పేర్కొన్నట్లుగా ఆరు వారాలు వ్యాక్సిన్ వస్తుందో రాదో తేలాలంటే.. అప్పటివరకు వెయిట్ చేయటం తప్పించి మరో మార్గం లేదనే చెప్పాలి.