Begin typing your search above and press return to search.
రిపబ్లిక్ టీవీపై ఉద్ధవ్ సర్కార్ ఉచ్చు....విచారణ వేగవంతం
By: Tupaki Desk | 13 Oct 2020 10:00 AM ISTముంబైలో టెలివిజన్ చానెళ్ల రేటింగ్ (టీఆర్‌పీ) స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆర్నబ్ చుట్టు ఉచ్చు బిగించేందుకు ఉద్ధవ్ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ టీవీ, మరో రెండు చానెళ్లు టీఆర్పీల కోసం అవకతవకలకు పాల్పడుతున్నాయని ముంబై పోలీస్ కమిషనర్ పరమవీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తమపై కక్ష సాధింపుతోనే పరమ్ వీర్ ఈ ఆరోపణలు చేస్తున్నారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అన్నారు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ టీవీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎ్‌ఫవో) ఎస్.సుందరం, కొందరు సీనియర్ ఉద్యోగులను, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. తాజాగా, మరి కొంతమంది రిపబ్లిక్ టీబీ సిబ్బందిని పోలీసులు విచారణ జరిపారు. రిపబ్లిక్ టీవీ సీఈఓ వికాస్ ఖంచందాని, సీఈఓ హర్ష్ భండారీ, డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్శ్యామ్ సింగ్ లను ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రశ్నించారు. రిపబ్లిక్ టీవీకి చెందిన పలు విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆ చానెల్ కు సంబంధించిన మీడియా ప్లానర్లు, కొనుగోలుదారులు, ప్రకటనల ఆదాయాలు, ప్రకటనదారులను బోర్డులోకి తీసుకురావడం, ప్రకటన ఆదాయాల పంపిణీలో టిఆర్పిల కీలక పాత్ర వంటి విషయాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఖాన్చందాని, భండారీలిద్దరూ టిఆర్పి ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీ సంపాదించిన ప్రకటనలు, ఆదాయానికి సంబంధించిన పత్రాల తీసుకొని మరోసారి విచారణకు హాజరు కావాలని రిపబ్లిక్ ఉద్యోగులను కోరినట్లు తెలుస్తోంది. బార్-ఓ-మీటర్లు బిగించి, రిగ్ రేటింగ్‌లకు రాజీపడిన ఇళ్లకు డబ్బు చెల్లించిన రాకెట్‌లో భాగమైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆ చానెల్ చూసేందుకు రూ. 200 చెల్లించారని కొందరు వినయోగదారులు చెప్పినట్లు, ఈ విషయంలో బార్క్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇండియా టుడే టీవీ ఛానెల్‌కు వ్యతిరేకంగా బార్క్ ఇండియా నుంచి దర్యాప్తు నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.