12ఏళ్ల బాలికపై అత్యాచారం.. 13ఏళ్ల శిక్ష

Sat Jan 12 2019 16:49:47 GMT+0530 (IST)

నిండా 12 ఏళ్లు కూడా లేని బాలికను లొంగదీసుకొని ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. సింగపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. భారత్ కు చెందిన 31ఏళ్ల ఉదయ్ కుమార్ దక్షిణామూర్తి సింగపూర్ లోని ఓ షాపులో పనిచేస్తుంటాడు. ఆ క్రమంలోనే 12 ఏళ్ల బాలికను పరిచయం చేసుకొని ఆమె మాయమాటలు చెప్పి.. బహుమతులు  - ఐస్ క్రీలు కొనిపించి తన భార్యగా చెప్పుకొని మూడు నెలలుకు పైగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  2016 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ దారుణం జరిగింది.అనంతరం ఉదయ్ కుమార్ ఆ బాలిక నగ్న వీడియోలను ఫోన్లో తీసుకొని ఎంజాయ్ చేశాడు. ఉదయ్ ఆ తర్వాత వేరే అమ్మాయిని ప్రేమించి ఆమెతో ఉండగా ఆ ప్రియురాలు ఉదయ్ ఫోన్ చూసి బాలికతో సాగించిన సరసాలు చూసి షాక్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం బయటపడింది.

అసలు సెక్స్ అంటే తెలియని అమ్మాయిని.. సెక్స్ రుచిచూపిస్తానని ఉదయ్ ఆశపెట్టి లొంగదీసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై లైంగిక దాడి కోసం బొమ్మలు - బహుమతులు - ఐస్ క్రీంలు కొన్ని అత్యాచారం చేసేవాడని తేలింది. ఇలా బాలికను మచ్చిన చేసుకొని లైంగిక దాడి చేసినట్లు ఉదయ్ కుమార్ ఒప్పుకోవడంతో సింగపూర్ కోర్టు అతడికి 13 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.