Begin typing your search above and press return to search.
తమిళ పాలి‘ట్రిక్స్’:హీరో ఉదయనిధి అరెస్ట్
By: Tupaki Desk | 21 Nov 2020 9:45 AM ISTతమిళనాడు ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈసారి డీఎంకే విజయం పక్కా అనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. తాజాగా తమిళనాడులో డీఎంకే తరుఫున ఎన్నికల ప్రచారానికి యత్నించిన హీరో, డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ ఉదయనిధిని అధికార అన్నా డీఎంకే పార్టీ అరెస్ట్ చేయించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
నిన్న మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, హీరో కమల్ హాసన్ సైతం ఒక వీడియో రిలీజ్ చేసి తమిళ ఎన్నికలపై ప్రజలను సమాయత్తం చేశాడు. తాజాగా ఉదయనిధి ర్యాలీకి యత్నించడం విశేషం.
కరోనా నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ తీశారని పార్టీ చీఫ్ స్టాలిన్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగారు. పెద్ద ఆందోళన చేశారు.
అనంతరం ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు. తొలిరోజు ప్రచారమే అధికార అన్నాడీఎంకే సర్కార్ వెన్నులో వణుకు పుట్టిందని ఉదయనిధి ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ుండడంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.