Begin typing your search above and press return to search.
గుండుతో ఉన్న డ్రైవర్ ను గుర్తు పట్టని ఊబర్.. మరెలా?
By: Tupaki Desk | 2 April 2021 11:35 AM ISTతిరుమలకు వెళ్లి గుండు చేయించుకున్న హైదరాబాద్ కు చెందిన ఊబర్ డ్రైవర్ కు వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్ కు చెందిన ఇతగాడు.. స్వామివారికి తలనీలాలు సమర్పించాడు. అనంతరం హైదరాబాద్ కు వచ్చిన అతడు.. యాప్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే కుదర్లేదు. మూడుసార్లు ప్రయత్నించినా..కుదరకపోవటంతో సాంకేతిక సమస్య అనుకొని నాలుగోసారి ప్రయత్నించాడు.
దీంతో.. అతడి ఖాతా పూర్తిగా బ్లాక్ అయ్యింది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఊబర్ లో పని చేసిన ఇతను ఇప్పటివరకు 1428 ట్రిప్పులతో 4.67 స్టార్ రేటింగ్ తో ఉన్నాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించాడు. తిరుమల నుంచి వచ్చాక ఊబర్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించానని.. తల మీద జుట్టు లేకపోవటంతో యాప్ తననుగుర్తు పట్టలేదన్నాడు. దీంతో.. తన ఖాతా బ్లాక్ అయినట్లు చెప్పిన అతను తర్వాతి రోజు ఊబర్ కార్యాలయానికి కంప్లైంట్ చేసేందుకు వెళితే.. తనకు మరింత షాక్ తగిలినట్లు చెప్పారు.
తన కారుకు వేరే డ్రైవర్ ను పెట్టుకోవాలని సూచన చేశారని.. ఆ భారాన్ని తాను భరించలేనని నెల రోజుల పాటు ఊబర్ చుట్టూ తిరిగితే.. ఉన్నతాధికారులు తన ఇష్యూను పైకి తీసుకెళ్లినట్లుగా చెప్పారే కానీ.. ఇప్పటివరకు ఈ ఇష్యూను క్లోజ్ చేయలేదన్నారు. తనకు డ్రైవింగ్ జీవనాధారమని.. కారుకు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్న అతను.. ఊబర్ యాప్ తీరుపై వేదనను వ్యక్తం చేశాడు. లాక్ డౌన్ ఇబ్బందుల నుంచి ఇంకా బయటపడని వేళలో.. యాప్ లోని సాంకేతిక అంశాల కారణంగా ఏర్పడుతున్న కొత్త చిక్కులు తమను మరింత సమస్యల్లోకి నెడుతున్నాయని వాపోయాడు. మరి.. ఇలాంటి సమస్యల మీద ఊబర్ ఎందుకని వెంటనే రియాక్టు కాదు?