Begin typing your search above and press return to search.
మేం లేచిపోవడం తప్పా! కోర్టుకెక్కిన ఇద్దరమ్మాయిలు..
By: Tupaki Desk | 7 Sept 2020 1:00 PM ISTవాళ్లిద్దరూ అమ్మాయిలు.. అయితేనేం మనసులు కలిశాయి. ఒకరికొకరు ఎంతో నచ్చారు. ఇద్దరి అభిరుచులు. అభిప్రాయాలు ఒక్కటే. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఈ పాడు సమాజం.. ఈ పెద్దాలున్నారే.. వాళ్లను అస్సలు అర్థం చేసుకోలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఈ జంట కోర్టుకెక్కింది. స్వలింగ సంపర్కం తప్పు కాదని మనదేశంలోని అత్యున్నత న్యాయస్థానమే తీర్పు చెప్పినప్పడు మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్‌కు చెందిన పాయల్, కాంచన 2017లో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2018 నుంచి కలిసే ఉంటున్నారు. కానీ వారికి ఈ సమాజం నుంచి చిత్కారమే ఎదురయ్యిందట. ఇరువురి కుటుంబసభ్యులు వాళ్లను ఎంతో బెదిరిస్తున్నారట. చంపుతామని హెచ్చరికలు కూడా జారీచేశారట దీంతో విధిలేని సమయంలో కోర్టుకెక్కారు. దీంతో ఈ జంటకు సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
గుజరాత్‌లోని మారుమూల గ్రామానికి చెందిన పాయల్, కాంచన్ చిన్నప్పటి నుంచే ధైర్యం కలవారు. అందుకే పోలీస్రంగాన్ని ఎంచుకున్నారు. పోలీస్ అకాడమీలో వీళ్లద్దరూ ఓకే గదిలో కలిసిఉండేవారు. బయటకొచ్చాక కలిసి బతుకుదామనుకున్నారు. కానీ ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. అయితే ప్రస్తుతం వీళ్లు ఏమంటున్నారంటే.. ఎవరు అడ్డుచెప్పినా మేం మనసు మార్చుకోము. మేం కలిసే బతుకుతాం. ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాం. ఈ కరోనా తగ్గాక దక్షిణభారతదేశం వెళ్లి అక్కడే జీవనం సాగిస్తాం. అంటున్నది ఈ జంట.