Begin typing your search above and press return to search.

ట్రంప్ మద్దతుదారుల ర్యాలీలో కాల్పులు..ఇద్దరు మహిళలకు గాయాలు

By:  Tupaki Desk   |   7 Nov 2020 6:30 PM IST
ట్రంప్ మద్దతుదారుల ర్యాలీలో కాల్పులు..ఇద్దరు మహిళలకు గాయాలు
X
అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ విజయానికి అడుగు దూరంలో ఉన్నారు.

ఓటమి అంచుల్లో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విద్వేశపూరిత వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారు. ఆయన మద్దతుదారులు ట్రంప్ ను మించి రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆయనకు మద్దతుగా సాగిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి.

అమెరికాలోని ఫ్లోరిడాలో గల ఫోర్డ్ లౌడెర్ డేల్ ప్రాంతంలో నిన్న సాయంత్రం చేపట్టిన ర్యాలీ కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ ర్యాలీలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.

ర్యాలీ కోరల్ రిడ్జ్ మాల్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓ కారులో వచ్చిన ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

ట్రంప్ మద్దతుదారులను టార్గెట్ చేసి ఈ కాల్పులు జరిగాయా? గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటారనే ఐడెంటిటీ బయటకు రాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.