Begin typing your search above and press return to search.
వందేళ్ల మసీదు సీజ్..మతప్రార్థనల్లో పాల్గొన్న 24మందికి కరోనా
By: Tupaki Desk | 31 March 2020 2:21 PM ISTదేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్ మసీదులో నిర్వహించిన సామూహిక ప్రార్థనలు కొంప ముంచాయి. ఈ ప్రార్థనల్లో విదేశీయులు పాల్గొనడంతో వారి ద్వారా కరోనా చాలా మందికి సోకింది.
తాజాగా ఈ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో 24మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇంకా కేసులు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వీరంతా ఢిల్లీ వాసులేనని కేంద్రం వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ పోలీసులు మసీదును సీజ్ చేశారు.
ఈ మసీదులో మొత్తం 1700మంది వరకు ప్రార్థనలు చేశారని సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇప్పటిదాకా 800మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామని అధికారులు తెలిపారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ మర్కాజ్ మసీదులో ప్రార్థనలు నిర్వహించడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణించారు. స్థానిక యంత్రాంగం పట్టించుకోక పోవడంపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారానే కరోనా సోకిందని తెలిపారు.