Begin typing your search above and press return to search.

ఉగాండా యువ‌తిపై హైద‌రాబాద్‌ లో గ్యాంగ్ రేప్‌

By:  Tupaki Desk   |   5 May 2018 10:57 AM IST
ఉగాండా యువ‌తిపై హైద‌రాబాద్‌ లో గ్యాంగ్ రేప్‌
X
సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌యం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలే త‌ప్పించి.. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించినా మొత్తానికే మోస‌పోవ‌ట‌మేన‌న్నది నిజ‌మైంది. సోష‌ల్ స్నేహాల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పే ఈ ఉదంతంలోకి వెళితే..

సూడాన్ కు చెందిన ఇద్ద‌రు యువ‌కులు హైద‌రాబాద్‌ లో వేర్వేరు కాలేజీల్లో చ‌దువుతున్నారు. రెండేళ్ల క్రితం మ‌హ్మ‌ద్ ఫాజిర్ అనే సూడాన్ యువ‌కుడు ఫేస్ బుక్ ద్వారా ఉగాండాకు చెందిన ఒక యువ‌తికి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆమె ఫుణేలో త‌న సోద‌రుడితో క‌లిసి నివాసం ఉంటోంది. అక్క‌డే ఉద్యోగం చేస్తోంది. వారిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ ఛాటింగ్ చేసుకునేవారు.

మ‌హ్మ‌ద్ ఆహ్వానం మేర‌కు స‌ద‌రు యువ‌తి నెల క్రితం హైదైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా వారిద్ద‌రూ క‌లిసి హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. ఏప్రిల్ 28న మ‌రోసారి ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈసారి హోట‌ల్లో కాకుండా సీతాఫ‌ల్ మండిలోని త‌న ఫ్లాట్‌కు వెళ‌దామ‌న్నాడు. అక్క‌డికి వ‌చ్చాక అమ‌ర్ హ‌స‌నే అనే యువ‌కుడ్ని త‌న ఫ్రెండ్ గా ప‌రిచ‌యం చేశాడు. ముగ్గురు క‌లిసి నాలుగు రోజుల పాటు హైద‌రాబాద్ అంతా తిరిగారు.

గురువారం రాత్రి ఫ్లాట్ కు వ‌చ్చే ముందు మ‌ద్యం తీసుకొచ్చారు. వ‌ద్దంటున్నా ఆమెతో కూడా తాగించారు. మ‌త్తులో ఉండ‌గా మ‌హ్మ‌ద్ ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ప్ర‌తిఘ‌టించ‌టంతో ఇద్ద‌రు యువ‌కులు క‌లిసి తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

శుక్ర‌వారం ఉద‌యం బాధితురాలు పోలీసుల్ని ఆశ్ర‌యించి జ‌రిగిన దారుణం గురించి ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్భ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. సూడాన్ రాయ‌బార కార్యాల‌యానికి స‌మాచారాన్ని అందించారు. అనంత‌రం వారిని జ్యూడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు. అప్పుడే ప‌రిచ‌య‌మైన వారి విష‌యంలోనూ.. సోష‌ల్ మీడియా స్నేహితుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఈ త‌ర‌హా దారుణాల‌కు అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బీకేర్ ఫుల్‌.