Begin typing your search above and press return to search.

ఇంకో రెండేళ్లు ఐటీ క‌ష్టాలేనంట‌

By:  Tupaki Desk   |   17 May 2017 2:06 PM GMT
ఇంకో రెండేళ్లు ఐటీ క‌ష్టాలేనంట‌
X
ఐటీ ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ‌కు ఎప్పుడు బ్రేక్ ప‌డుతుంది? ప‌్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న అడిగితే అమాయ‌క‌త్వం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది ఎందుకంటే ఒక‌టి తర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా దేశీయ‌, అంత‌ర్జాతీయ దిగ్గ‌జాల‌న్నీ ఉద్యోగుల తొల‌గింపు ల‌క్ష్యంగానే ముందుకు సాగుతున్నాయ‌నేది కాద‌న లేని నిజం. అయితే ఒక‌టి రెండు సంవ‌త్స‌రాలు ఇదే ప‌రిస్థితులు ఉంటాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఆటోమేషన్ కారణంగా ఇన్ఫోసిస్ - కాగ్నిజంట్ - టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటి కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోతలు చూస్తామని, వచ్చే 1 - 2 ఏళ్ల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా - సింగపూర్ - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ వంటి దేశాల్లో చేపడుతున్న కఠిన నిబంధన ఫలితంగా దేశీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థలకు వ్యాపారంలో ఎదురుగాలులు మొదలయ్యాయి. కృత్రిమ మేధస్సు, రోబోటిక్ ప్రక్రియ ఆటోమేషన్ - క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు తక్కువ మానవ శక్తితో పనిని పూర్తి చేసేందుకు సహకరిస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం మార్పు వైపు ఆసక్తి చూపడంతో ఉద్యోగులపై ప్రభావం ఏర్పడుతోంది. జూనియర్ స్థాయి ఉద్యోగులు చేసే పనిని ఆటోమేషన్ వంటి రోబోటిక్ విధానాలతో చేయగల్గే పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా వారిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది. ‘సరికొత్త టెక్నాలజీ కారణంగా పరిశ్రమలో ప్రతి 3-5 ఏళ్లకోసారి హేతుబద్ధీకరణ జరుగుతోంది. అయితే ఐటీ ఉద్యోగులపై అమెరికా విధానాల్లో మార్పులు చేయడం వల్ల ఈ ప్రభావం ఈసారి మరింతగా ఉంది’ అని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ గ్లోబల్‌ హంట్ ఎండి సునీల్ గోయెల్ అన్నారు. ఈ పరిస్థితి మరో రెండేళ్ల పాటు కొనసాగనుందని, తమతమ ప్రతిభను మెరుగుపర్చుకునేందుకు ఐటి వృత్తి నిపుణులకు ఇది మంచి అవకాశమని అన్నారు.

జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా సైతం మ‌రో ఆస‌క్తిక‌ర విశ్లేషణ చేసింది. ``రోబోటిక్ ప్రక్రియ ఆటోమేషన్ దిశగా కంపెనీలు మార్పులు చేపట్టడం ఉద్యోగాల కోతలకు ప్రధానంగా కారణం.డేటా సైన్స్ - కృత్రిమ మేధస్సు - డిజిటల్ డొమైన్ వంటి సరికొత్త టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇన్ఫోసిస్ - కాగ్నిజంట్ - టెక్ మహీంద్రా - విప్రో వంటి కంపెనీల్లో మొత్తం 7,60,000 మంది ఉద్యోగుల్లో 2-3 శాతం జాబ్‌ ల కోత విషయమేమీ కాదు`` అని విశ్లేషించింది. అయితే డిజిటల్ నైపుణ్యత వైపు శ్రామికశక్తి పునర్నిర్మాణం జరిగేంత వరకు ఇలాంటి హేతుబద్ధీకరణ విధానం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది.

మ‌రోవైపు మ‌న ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 150 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ పరిశ్రమ మందగమనం వైపు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భారత ఐటి దిగ్గజాలు అన్నీ ఈ ఏడాదిలో భారీఎత్తున ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. అదే సమయంలో మరింతగా అమెరికన్లను నియమించుకునేందు కు సిద్ధమవుతున్నాయి. 2008లో ఆర్థిక మందగమనం ఏర్పడినప్పుడు తొలగించిన ఉద్యోగుల కంటే ఇప్పుడు భారీగా ఉద్యోగాల కోతకు.. విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ వంటి కంపెనీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై తొలుత ఈ ప్రభావం పడనుందని, ఈ ఏడాది ద్వితీ యార్థంలో జూనియర్ ఉద్యోగుల తొల గింపు ఉంటుందని తెలుస్తోంది. సంస్థలు ఉద్యోగుల ప్రతి భను పరిశీలించి, ఇతర అంశాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోనున్నాయి. కాగ్ని జెంట్ టెక్నాలజీస్ భారీగా 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఇప్పటికే సంకేతాలివ్వగా.. వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమె రికన్లను భర్తీ చేస్తామని ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనతో భార తీయుల తొలగింపు ఖాయమని తెలుస్తోంది. 10 శాతం ఉద్యోగులను వెనక్కి పంపాలని నిర్ణయించామని విప్రో ప్రతినిధి అన్నారు. ఫ్రెంచ్ ఐటీ సేవల సంస్థ క్యాప్‌ జెమినీ 9 వేల మందిని ఇంటికి పంపే పనిలో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/