Begin typing your search above and press return to search.

క్వారంటైన్ లో ఉన్న యువతిని వదలని కామాంధులు

By:  Tupaki Desk   |   22 May 2020 7:50 AM GMT
క్వారంటైన్ లో ఉన్న యువతిని వదలని కామాంధులు
X
మహమ్మారి సోకి క్వారంటైన్ లో ఉన్న యువతిని సైతం కామాంధులు వదలడం లేదు. బతుకు కోసం పోరాడుతూ ప్రభుత్వ పాఠశాలలో భయం భయంగా ఉన్న ఆమెపై తమ కామోద్రేకాన్ని ప్రయోగించారు. తమ కోరిక తీర్చాలని బెదిరించారు.

మహమ్మారి లక్షణాలు ఉండడంతో అనుమానంతో క్వారంటైన్ లో ఉన్న యువతిని కామాంధులు వదలలేదు. ఆమెను లైంగికంగా వేధిస్తూ నరకం చూపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని దమో జిల్లాకు యువతి ఇండోర్ నుంచి తిరిగి రాగా ఆమెకు లక్షణాలు బయటపడ్డాయి. దీంతో సాగర్ జిల్లాలోని కుమార్ భటోలి గ్రామంలోని ఓ పాఠశాలలో యువతిని క్వారంటైన్ లో ఉంచారు. బాధిత యువతి కేంద్రం వెలుపల బాత్ రూంలో స్నానం చేస్తుండగా నిందితులు వీడియో తీసి ఆ క్లిప్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు.

తమ కోరిక తీర్చాలని లేదంటే సోషల్ మీడియాలో దీన్ని పెడతామని రోజురోజుకు వేధింపులు ఎక్కువ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.