Begin typing your search above and press return to search.

ఇద్దరు బలి:టీ స్టేట్ లో తొలి మావో ఎన్ కౌంటర్

By:  Tupaki Desk   |   15 Sept 2015 12:22 PM IST
ఇద్దరు బలి:టీ స్టేట్ లో తొలి మావో ఎన్ కౌంటర్
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పూర్తి స్థాయి మద్ధుతు పలికిన మావోయిస్ట్ కు మొదటిసారి పెద్ద దెబ్బ పడింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో మావోయిస్ట్ ల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. వరంగల్ కు 120 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి సమీపంలోని వెంగళాపూర్ వద్ద మావోలకు.. పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఒక మహిళా మావోయిస్ట్ తో పాటు.. మరో మావోయిస్ట్ మరణించారు. మేడారం అటవీ ప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారని సమాచారం అందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోలు తారసపడ్డారు. వారిని లొంగిపోవాలని కోరినా వినకపోవటం.. కాల్పులు జరపటంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.

దీంతో.. ఒక మహిళా మావోయిస్ట్ తో పాటు.. మరో మావోయిస్ట్ మరణించినట్లు చెబుతున్నారు. దీంతో.. వారితో ఉన్న మావోలు అడవిలోకి పారిపోయినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు తుపాకీలు.. కిట్ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి పది మంది మావోలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశ పెట్టినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదిహేను నెలల తర్వాత చోటు చేసుకున్నతొలి మావో ఎన్ కౌంటర్ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.