Begin typing your search above and press return to search.

కన్నడ సంక్షోభం.. సీఎం రేసులో ఇద్దరు

By:  Tupaki Desk   |   8 July 2019 7:39 AM GMT
కన్నడ సంక్షోభం.. సీఎం రేసులో ఇద్దరు
X
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముంబైలోని ఓ రిసార్ట్ లో క్యాంప్ కట్టారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల్లో ఏర్పడింది.

అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆ 12మంది మాజీ కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యకు అనుంగ అనుచరులు కావడం.. వారంతా సిద్ధరామయ్యను సీఎం చేస్తేనే తాము దిగి వస్తామని.. లేదంటే కూల్చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.

ఇక తన కుమారుడు కుమారస్వామి కన్నడ ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అయిన కాంగ్రెస్ నేతలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ విరుచుకుపడ్డారు. ఒకప్పటి తన అనుయాయుడు, కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య వల్లే ఈ పరిస్థితి అని ఆరోపించారు. సిద్ధరామయ్యను మళ్లీ ముఖ్యమంత్రిని కానివ్వమని.. అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్, ఇతర సీనియర్లు ఆదివారం దేవెగౌడ, అమెరికా నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కుమారస్వామని కలిశారు. రెబెల్ ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించాలని సిద్ధరామయ్యను కోరగా.. ఆయన ముగ్గురిని మాత్రమే వెనక్కి రప్పిస్తానని.. మిగతా వారు ఎమ్మెల్యే రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మాటిస్తేనే వాళ్లు వెనక్కి వచ్చేస్తారని సూచించారు.

ఇక కర్ణాటకలో కుమారస్వామిని గద్దెదింపాలని యోచిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు సిద్ధరామయ్యను సీఎం చేయాలని కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను సీఎం చేస్తే మంచిందని నెటిజన్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ట్రోల్ చేస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని.. సీనియర్ అయిన ఈయన అన్ని విధాల కన్నడ సీఎం అని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. అనేక సంక్షోభాల నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని విజయవంతంగా బయటపడేసిన నేతగా డీకే శివకుమార్ ను సీఎం చేయాలని కన్నడ వ్యాప్తంగా ముక్తకంఠంతో కోరుతున్నారు.