Begin typing your search above and press return to search.
ఢిల్లీలో కాల్పుల కలకలం ..ఇద్దరు మృతి !
By: Tupaki Desk | 13 Sept 2020 12:45 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దయాళ్‌పూర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకి పాల్పడ్డారు. ఊహించని ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంతో స్థానికంగా తీవ్రకలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అబ్దుల్లా హమీద్ , ఫారూక్ గా గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనలో గాయపడిన జోజఫ్ ను ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే, రెండు గ్యాంగుల మధ్య జరిగిన కాల్పులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ వారికోసం సీసీ ఫుటేజీల అధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే , శనివారం అర్థరాత్రి దుండగులు బైక్ పై వచ్చి ముగ్గరు వ్యక్తుల పై పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుండగులు మూంగా నగర్ లో ఒక వ్యక్తి పై కాల్పులు జరిపారు. అలాగే అక్కడికి సమీపంలోని నెహ్రూ విహార్ లో మరొక వ్యక్తి పై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలోని సీటీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు తెగబడ్డవారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.