వైరల్ 'విండో' వార్...ఏకంగా ఫ్లైట్ లోనే

Wed Nov 20 2019 19:17:42 GMT+0530 (IST)

two grown men fighting over a window shade on a flight has been going viral

విమానంలో ‘విండో’ గోలేమిటీ? అనుకుంటున్నారా? మనిషి మనస్తత్వం అలాంటిది మరి. తమ సౌకర్యం మాత్రమే చూసుకునే తత్వం... ఆ సౌకర్యం ఇతరులకు అసౌకర్యంగా మారినా కూడా పట్టించుకోని తత్వం... ఎక్కడైనా గొడవ పెట్టేస్తుంది. అది భూమ్మీద అయినా - ఆకాశంలో అయినా - సముద్రంలో అయినా... ఎక్కడైనా గొడవ పెట్టేస్తుంది. ఈ తరహా గొడవలు చూడ్డానికి కాస్తంత కామెడీగానే అనిపించినా.. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా కనిపించినా... సర్దుబాటు గుణం లేని వ్యక్తులతో ఈ తరహా గొడవలు సర్వసాధారణమేనని మనకు మనమే సర్దిచెప్పుకోక తప్పదు. సరే... ఈ ఉపోద్ఘాతం బాగానే ఉంది గానీ... అసలు విషయంలోకి వెళ్లిపోదాం పదండి.నిండా ప్రయాణికులతో వినువీధికి ఎగిరిన ఓ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణ అంటే... విమానంలో వారిద్దరు కొట్టుకున్నారని చెప్పడానికి వీల్లేదు. కేవలం తమ ఇద్దరి సీట్ల మధ్య ఓ పక్కగా ఉన్న కిటికీని ముందు సీటు వ్యక్తి తెరిస్తే... అబ్బే అది తనకు అసౌకర్యంగా ఉందంటూ వెనక సీటు వ్యక్తి దానిని వెంటనే మూసేశాడు. ఇది ఒక్కసారో - రెండు సార్లో జరిగి... ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుని ఉంటే అసలు ఈ ఘటన వార్త అయ్యేదే కాదు. అలా చాలా సార్లు... దాదాపుగా రెండు నిమిషాల పాటు వారిద్దరూ విండో వార్ ను కొనసాగించారు. అంతేనా... ఎయిర్ హోస్టెస్ వచ్చి వారికి సర్దిచెప్పినా కూడా వారు తగ్గలేనంతగా.

నిజమా? అంటే... సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ గా మారిన ఈ విండో గోల వీడియోను చూస్తే మాత్రం నిజమేనని చెప్పక తప్పదు. ఏదో బస్సులోనో రైలులోనే ఇలా కిటికీ విషయంలో గొడవ జరిగిందంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు గానీ... అసలు కిటికీతోనే ఎలాంటి అవసరం లేని ఆకాశయానంలో... అది కూడా వినువీధిలో విమానం ఎరుగుతున్న సమయంలో ఈ గొడవ జరగడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఈ విమానంలో విండో గొడవ ఎక్కడ ఏ ఫ్లైట్ లో ఏ రూట్ లో జరిగిందన్న వివరాలు మాత్రం తెలియ రాలేదు.
    
వీడియో కోసం క్లిక్ చేయండి