Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: కొత్త పెళ్లికొడుకు అరెస్ట్

By:  Tupaki Desk   |   24 March 2020 11:00 PM IST
కరోనా ఎఫెక్ట్:  కొత్త పెళ్లికొడుకు అరెస్ట్
X
పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒక్కసారే జరిగే ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు. ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ పెళ్లి కొడుకు అలానే రెడీ అయ్యాడు. కానీ కరోనా వైరస్ ఇప్పుడా పెళ్లికొడుకును కటకటాలు పాలు చేసింది.

దేశమంతా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని.. ఐదుగురు కనిపిస్తే అరెస్టే అని ఆదేశించింది. అన్నింటిని బంద్ చేసింది. కానీ ఈ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ పెళ్లి కొడుకు ఏకంగా రిసెప్షన్ పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పెళ్లికొడుకును ఏకంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వార్త వైరల్ గా మారింది.

ఒడిషాలోని కంధమాల్ జిల్లాలోని నౌపాద గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరమేశ్వర్ భుక్తా అనే యువకుడు పెళ్లి చేసుకొని ఏకంగా రిసెప్షన్ పెట్టేశాడు. ఈ వేడుకకు 60 నుంచి 80 దాకా గ్రామస్థులు హాజరయ్యారు. లాక్ డౌన్ అమలులో ఉండగా ఐదుగురికి మించి గూమిగూడవద్దని ఆదేశాలున్నా వాటిని అతిక్రమించి పెళ్లి వేడుక నిర్వహించాడు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వరుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పెళ్లిలో వరుడినే అరెస్ట్ చేయడంతో వేడుకకు హాజరైన వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.