Begin typing your search above and press return to search.

జగిత్యాలలో పెళ్లైయిన రెండు రోజులకే పెళ్లి కుమార్తె కిడ్నాప్

By:  Tupaki Desk   |   10 Nov 2020 10:15 AM IST
జగిత్యాలలో పెళ్లైయిన రెండు రోజులకే పెళ్లి కుమార్తె కిడ్నాప్
X
ఓ జంట పెళ్లి చేసుకొని కేవలం రెండు రోజులే అయ్యింది. తాము కోరుకున్న జీవితాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కుమార్తెను.. ఆమె తల్లిదండ్రుల తరఫు వారు కిడ్నాప్ చేసిన ఉదంతం సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి.

జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. గ్రామానికి చెందిన రాకేశ్.. జిల్లాకు చెందిన పెంబట్ల గ్రామానికి చెందిన సమతలు ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి వధువు తల్లిదండ్రులు నోచెప్పారు. కులాలు వేరు కావటంతో నో చెప్పారు. దీంతో.. పెద్దలకు చెప్పకుండా ఈ యువ గుట్టుగా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సారంగాపూర్ పోలీసుల వద్దకు వెళ్లి తమకు రక్షణ ఇవ్వాలని కోరారు. దీంతో.. ఈ జంట తల్లిదండ్రుల్ని స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ఇరు వర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కొత్త జంట పొరండ్లలో కాపురం పెట్టారు.

సమతను రాకేష్ పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కు స్కెచ్ వేశారు. సమత సోదరుడు సాయి.. కొందరు యువకుల సాయంతో పొరండ్ల గ్రామానికి చేరుకొని.. రాకేష్.. అతడి కుటుంబంపై దాడి చేసి సమతను కిడ్నాప్ చేసుకొని కారులో వెళ్లిపోయారు. దీంతో.. తన భార్యను కిడ్నాప్ చేసినట్లుగా పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.