Begin typing your search above and press return to search.

కేరళలో కలకలం..మరో 28 పాజిటివ్ కేసులు..మొత్తం 95

By:  Tupaki Desk   |   23 March 2020 3:26 PM GMT
కేరళలో కలకలం..మరో 28 పాజిటివ్ కేసులు..మొత్తం 95
X
దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. గత రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరిగాయి. సోమవారం ఒక్క రోజే కేరళలో కొత్తగా 28 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రం లాక్ డౌన్ ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 95కి పెరిగింది. వీరిలో మొదట్లో సోకిన నలుగురికి ప్రస్తుతం నయమై ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

మిగతా రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఆయా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి కర్ఫ్యూను విధిస్తున్నట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌ డౌన్‌ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. నియంత్రణలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

మరోవైపు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికే వచ్చిన విదేశీయులకు కరోనా ఉండడం వల్ల తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 33కి చేరింది. ఇవాళ మూడు కేసులు నిర్ధరణ అయ్యాయి. వారిలో ఒకరు న్యూయార్క్ నుంచి - ఒకరు లండన్ నుంచి - మూడవ వారు శ్రీలంక నుంచి వచ్చారు. ఇక కరీంనగర్‌ లో ఇండోనేషియా వ్యక్తులను కలసిన ఒక స్థానికుడికి కూడా కరోనా సోకింది. దీంతో స్థానికంగా కరోనా సోకిన వారి సంఖ్య 2 కు చేరింది. ఈ 33 మందిలో ఒకరిని ఇప్పటికే డిశ్చార్జి చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ వంద శాతం కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.