Begin typing your search above and press return to search.
ఆఫ్గన్ కొత్త అధ్యక్షుడికి షాకిచ్చిన ట్విట్టర్.. !
By: Tupaki Desk | 20 Aug 2021 12:00 PM ISTతాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్ అల్లకల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత సాక్ష్యాత్తూ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోవడంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్న తాలిబన్లకు అమ్రుల్లా సాలే రూపంలో భారీ షాక్ ఎదురైంది. ఘని కేబినెట్ లో అంతర్గత వ్యవహారాల మంత్రిగా, దేశానికి మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అమ్రుల్లా సాలే ఇప్పుడు తానే అఫ్గాన్ అధ్యక్షుడినని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు పలు దేశాలు మద్దతు కూడా ప్రకటించాయి.
అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత వారాల వ్యవధిలోనే మెజార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకున్న తాలిబన్ సేనలు, ఆదివారం నాటికి రాజధాని కాబూల్ నగరాన్ని కూడా చెరపట్టారు. తాలిబన్లు కాబూల్ లోకి ప్రవేశించే సమయానికే అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోవడంతో వారి పని మరింత సులవైంది. ముల్లా బరాదర్ ను అధ్యక్షుడిగా నియమిస్తూ అఫ్గాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు, దోహా వేదికగా జరుగుతోన్న చర్చల్లో తమ ప్రభుత్వానికి గుర్తింపు లభించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పడుతుందనగా, అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రూల్లా సాలే వ్యూహాత్మకంగా తెరపైకొచ్చి తానే దేశానికి కేర్ టేకర్ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు.
అఫ్గానిస్థాన్ రాజ్యాంగం ప్రకారం పదవిలో ఉన్న అధ్యక్షుడు చనిపోయినా, కనిపించకుండా పోయినా అప్పటికి మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చేతికి పరిపాలనా పగ్గాలు వెళతాయి. ఆ నిబంధన ప్రకారం, ఘని నిష్రమణతో దేశానికి తానే కేర్ టేకర్ ప్రెసిడెంట్ అవుతానని అమ్రుల్లా సాలే ప్రకటించుకున్నాడు. అయితే తాజాగా అమ్రుల్లా సాలే కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. గురువారం అమ్రుల్లా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ అంశం సంచలనంగా మారింది. కాగా, తాలిబన్లకు తాను తలొగ్గేది లేదని, వారితో చివరివరకు పోరాటం చేస్తానని ప్రకటించాడు అమ్రుల్లా సాలేహ్.. ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్ ఆయన ఖాతాను తొలగించడం చర్చగా మారింది. అయితే, తమ సంస్థ నిబంధనలను అతిక్రమించే ఖాతాలను తొలగిస్తున్నామని, అందులో భాగంగానే అమ్రుల్లా సాలేహ్ ఖాతాను కూడా తొలగించామని చెప్పుకొచ్చింది ట్విట్టర్.
ఘని ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగానే కాకుండా మొదటి ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన అమ్రుల్లా సాలేకు, ప్రస్తుతం అతనికి మద్దతుగా నిలిచిన అహ్మద్ షా మసౌద్ పంరంపరకు భారత్ తో అవినాభావ సంబంధాలున్నాయి. తాలిబన్ వ్యతిరేక గడ్డపై పేరుపొందిన పాంజ్ షీర్ లోయలో జన్మించిన సాలే, 90వ దశకంలో అక్కడ జరిగిన తాలిబన్ వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకున్నాడు. తాలిబన్లకు చుక్కలు చూపించి, వాళ్ల పరిధిని కొంత వరకే నిలువరించగలిగిన లెజెండరీ నేత అహ్మద్ షా మసౌద్ ను తన గురువుగా సాలే చెప్పుకుంటున్నారు. 90లనాటి సంఘర్షణలో అహ్మద్ షా నేతృత్వంలోని పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చింది. అమ్రుల్లా సాలేకు భారత ఇంటెలిజెన్స్ సంస్థలే శిక్షణ ఇచ్చాయి. ఒక రకంగా భారత్ తీర్చిదిద్దిన సాలే తర్వాతి కాలంలో అప్గాన్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. ఘని సారధ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా, ఉపాధ్యక్షుడిగా ఎదిగారు.