Begin typing your search above and press return to search.

ట్రంప్ ట్విట్ హైడ్ చేసిన ట్విట్టర్ ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   24 Jun 2020 5:00 PM GMT
ట్రంప్ ట్విట్ హైడ్ చేసిన ట్విట్టర్  ..ఎందుకంటే ?
X
అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్విట్ ను ట్విట్టర్ సంస్థ కనిపించకుండా హైడ్ చేసి పెట్టింది. ఎందుకు అంటే .. ఇది ద్వేషపూరితమైన కంటెంట్ అని, తమ నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉందని ట్విట్టర్ తెలిపింది. ఇంతకీ ట్రంప్ చేసిన ఆ ట్విట్ లో ఏముంది అంటే ...వాషింగ్టన్ లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను ఉద్దేశించి, తాను ఈ దేశాధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఈ నగరం మీ అదుపులో ఉన్న ప్రాంతంగా ఉండబోదని, మీరిలాగే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.

అయితే, ఇది ఆందోళనకారులను రెచ్ఛగొట్టేదిగా ఉందని, అబ్యూసివ్ బిహేవియర్ ని ఖండించాలన్న తమ పాలసీకి విరుధ్ధంగా ఉందని ట్విటర్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వానికి, సోషల్ మీడియా వేదికలకు మధ్య తలెత్తిన విభేదాలను ఈ తాజాపరిణామం మరింత రాజుకునేలా చేసింది. తమకు ట్విటర్, ఫేస్ బుక్ వంటి సాధనాల నుంచి ఎలాంటి ముప్పు రాకుండా, తాము చెప్పిందే వేదమన్నట్టు ఎలాంటి కంటెంట్ పెట్టినా అది చెల్లుబాటయ్యేలా ఓ చట్టం తేవాలని ట్రంప్ సర్కార్ ఆలోచిస్తుంది. అయితే అలాంటి చట్టమే వస్తే దాన్ని కోర్టులో ఎదుర్కొనేందుకు ఈ సామాజిక మాధ్యమాలన్నీ రెడీగా ఉన్నాయి.