Begin typing your search above and press return to search.
బర్త్ డే రోజునే మోడీ కి షాక్ ఇచ్చిన ట్విట్టర్
By: Tupaki Desk | 18 Sept 2020 12:30 PM ISTసోషల్ మీడియా ప్రస్తుత రోజుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియా లో పీఎం మోడీ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భమేదైనా, సమయమేదైనా మోదీ ముందు వరుసలో ఉంటారు. అలాంటిది కొద్ది రోజులుగా మోదీ ప్రభ సోషల్ మీడియాలో తగ్గిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మద్యే మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగానికి సంబంధించిన వీడియో డిస్ లైక్ లతో మారుమోగిపోయింది. ఇక మోడీ పుట్టినరోజు నాడు కూడా మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మోదీ పుట్టిన రోజు అంటే ప్రపంచ వ్యాప్తంగా అభినందనలతో సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ లకు శ్రీకారం చుడుతుంది. అయితే ఈసారి ఇది రివర్సైంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు ట్విట్టర్ లో మోతమోగించింది.
మోదీ పుట్టిన రోజుకు వచ్చిన ట్వీట్ల కంటే ఇంచుమించు పదిరెట్లు ఎక్కువ ట్వీట్లతో ఇండియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మోడీ పుట్టిన రోజుకు సమాంతరంగా సోషల్ మీడియాలో నిరసనలకు కొంత మంది వ్యక్తులు, రాజకీయ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘నేషనల్ అన్ ఎంప్లాయ్‌మెంట్ డే హ్యాష్ ట్యాగ్‌తో గురువారం నిరసనను ప్రారంభించగా, దీనికి 16 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ‘హ్యాపీ బర్త్‌డే పీఏం మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ కంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించిన ఓ వార్తా కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ ‘‘దేశంలో పెరిగిపోయిన తీవ్ర నిరుద్యోగంతో యువత జాతీయ నిరుద్యోగ దినోత్సవానికి పిలుపునిచ్చారు. ఉద్యోగం అనేది కనీస గౌరవం. ప్రభుత్వం ఎన్ని రోజులు దీన్ని తాత్సారం చేస్తుంది’’ అని హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాసుకొచ్చారు. సెప్టెంబర్ 17న నిరుద్యోగ దినోత్సవం నిర్వహించాలని, దాని కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కొద్ది రోజుల క్రితమే పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగానే బుధవారం అర్థరాత్రి నుంచే ట్విట్టర్ లో నెటిజెన్లు మోడీ పై వీర లెవెల్ లోరెచ్చిపోయారు.