Begin typing your search above and press return to search.
ఎన్నికల వేళ ట్రంప్ కు ట్విట్టర్ గట్టి షాక్
By: Tupaki Desk | 16 Oct 2020 12:00 PM ISTఅధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసే ట్విట్టర్ ఖాతాను గురువారం కొద్దిసేపు నిలిపివేసింది. ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేయడం చేయడంపై రిపబ్లికన్ సభ్యులు మండిపడ్డారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.సోషల్ మీడియా కంపెనీలు స్వేచ్ఛను హరిస్తూ స్పీచ్ పోలీస్ గా వ్యవహరిస్తున్నాయని.. దీనిపై ట్విట్టర్ బాధ్యత వహించాలని ఆరోపించారు.
అయితే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్ కుమారుడిపై ట్రంప్ టీం ఓ వీడియోను పోస్ట్ చేయడమే ఈ వివాదానికి కారణం. ఉక్రెయిన్ ఇంధన కంపెనీతో హంటర్ బిడెన్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రస్తావిస్తూ ఈ వీడియోను ట్రంప్ టీం రూపొందించింది.
ఇది నిబంధనలకు విరుద్ధమని భావించిన ట్విట్టర్ యాజమాన్యం వెంటనే ట్రంప్ టీం ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రైవేట్ సమాచారం పోస్ట్ చేయడం..హ్యాక్డ్ మెటీరియల్స్ పై కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున టీం ట్రంప్, వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కీలిగ్, న్యూయార్క్ పోస్ట్ ల ఖాతాలను నిలిపివేశామని ట్విట్టర్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను తొలగిస్తే తిరిగి ఆయా ఖాతాల నుంచి ట్వీట్లు చేయవచ్చని ట్విట్టర్ తెలిపింది.
దీనిపై జోబైడెన్ టీం కూడా స్పందించింది. ఉక్రెయిన్ తో లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకోలేదని రిపబ్లికన్ సెనెట్ కమిటీలు నిగ్గుతేల్చాయని బిడెన్ క్యాంపెయిన్ ప్రతినిధి స్పష్టం చేశారు. ట్రంప్ టీం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.