Begin typing your search above and press return to search.
భారత్ కి క్షమాపణలు చెప్పిన ట్విట్టర్ .. కమిటీ ఏంచెప్పిందంటే ?
By: Tupaki Desk | 29 Oct 2020 9:20 PM ISTట్విట్టర్ యాజమాన్యం భారత్ కి క్షమాణాలు చెప్పింది. అదేంటి ట్విట్టర్ ట్విట్టర్ యాజమాన్యం భారత్ కి ఎందుకు క్షమాణాలు చెప్పింది అని ఆలోచిస్తున్నారా ! గత కొన్ని రోజుల ముందు ట్విటర్ లేహ్, జమ్మూ-కాశ్మీర్ ను భారత్ లో భాగంగా కాకుండా చైనా మ్యాప్ లో చూపించింది. లేహ్ లోని అమరవీరుల చిహ్నమైన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ నుంచి ట్విటర్ వేదికగా ఓ లైవ్ ప్రసారమైంది. అయితే, దాని లొకేషన్ ట్యాగ్ లో లద్దాఖ్ చైనాకు చెందిన ప్రదేశంగా దర్శనమిచ్చింది. ఆ విషయం పై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. లేహ్ అంటే అదాక్ హెడ్ క్వాటర్స్ అని అంతేకాకుండా జమ్ము-కాశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగాలేనని, వాటిని చైనా భాగాలుగా చూపించడం సరికాదని ట్విటర్ సీఈఓకు భారత పార్లమెంటు లేఖ రాసింది.
దీనిపై వివరణ కోరగా .. సంబంధిత సంయుక్త పార్లమెంట్ కమిటీకి ట్విటర్ ఇండియా ప్రతినిధులు సమాధానం చెప్పారు. భారత ప్రజల మనోభావాలను గౌరవిస్తామన్నారు. అలాగే జరిగిన తప్పుకి క్షమాపణలు కూడా తెలిపారు. అయితే, ఇది దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, భారత సార్వభౌమత్వం, సమగ్రతలకు సంబంధించిన విషయం కూడా అని కమిటీ చైర్ పర్సన్, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు. లద్దాఖ్ ను చైనా భూభాగంగా చూపినందుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చని అన్నారు. క్షమాపణలు మాత్రమే సరిపోవని ,అమెరికాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. దానిపై ట్విటర్ ప్రతినిథి స్పందించారు. ఇండియా విలువలను మేము గౌరవిస్తామనీ, ఆ దేశ విధానాలను సరిచూసుకుంటామనీ తెలిపారు. దానితో పాటుగా ఇండియా అడిగి క్షమాణాపత్రాన్ని త్వరలోనే అందజేస్తామని అన్నారు.