Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీ పర్సనల్ ట్విట్టర్ హ్యాక్ !
By: Tupaki Desk | 3 Sept 2020 10:30 AM ISTప్రధాని నరేంద్రమోడీ ట్విట్టరు అక్కౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ స్వయంగా ధృవీకరించింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వమని తన అనుచరులను కోరుతూ వరుస ట్వీట్లతో పిఎం మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్ ఖాతా నుంచి మెసేజులు వచ్చాయి. వీటిని పరిశీలించిన ట్విట్టరు మోడీ అక్కౌంట్ హ్యాక్ చేసినట్లు గురువారం ధృవీకరించింది.
అదేంటో గాని ఇటీవలే జూలైలో పలువురు ప్రముఖల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. తర్వాత ఏకంగా మన ప్రధాని అక్కౌంటే హ్యాక్ అయ్యింది. మోడీ అక్కౌంట్ కు హ్యాకర్ల నుంచి రక్షణ కల్పించి పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. 2011లో ప్రారంభమైన మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విట్టర్ ఖాతాను 25 లక్షల మంది ఫాలో అవుతున్నారు. మోడీ ఇందులో ఇప్పటివరకూ 37,000 వరకు ట్వీట్లు చేశారు.
ప్రముఖులను టార్గెట్ చేసిన హ్యాకర్లు జూలైలో ట్విట్టర్ యొక్క అంతర్గత వ్యవస్థలోకి చొరబడ్డారు. అమెరికా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిలియనీర్ ఎలాన్ మస్క్ అక్కౌంట్లను వారు హ్యాక్ చేశారు.