Begin typing your search above and press return to search.

మూడు ఫార్మాట్లలో సరికొత్త చెత్త రికార్డ్ సృష్టించిన పాక్ మాజీ కెప్టెన్ .. ఏంటంటే ?

By:  Tupaki Desk   |   2 Sep 2020 1:30 AM GMT
మూడు ఫార్మాట్లలో సరికొత్త చెత్త రికార్డ్ సృష్టించిన పాక్ మాజీ కెప్టెన్ .. ఏంటంటే ?
X
పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫామ్ కంటే ఫిట్‌నెస్ గురించే గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2019 వన్డే ప్రపంచ కప్ ‌లో భారత్ ‌తో జరిగిన మ్యాచ్‌ లో వికెట్ల వెనుక సర్ఫరాజ్ ఆవలింతలు తీయడం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. పాక్ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత పేలవ ఫిట్‌నెస్ ఉన్న కెప్టెన్ సర్ఫరాజ్ అని ఆ దేశ మాజీలు విమర్శించారు. ఇక ఫాన్స్ అయితే సర్ఫరాజ్ జట్టు నుంచి ఇప్పుడే తీసేయాలని పట్టుబట్టారు. ఆ తర్వాత కెప్టెన్ పదవి ఊడిపోయింది.

ఇక సర్ఫరాజ్ తాజాగా అదే ఆవలింతల విషయంలో నెటిజన్ల చేతికి చిక్కాడు. వారు ఊరుకుంటారా....అతడిని ఓ ఆడుకుంటున్నారు. ఇక , 2019 వన్డే ప్రపంచ కప్ సర్ఫరాజ్ జీవితంలో ఓ పీడకల. ఆ టోర్నీ అనంతరం అక్టోబరులో పేలవ ఫామ్, ఫిట్ ‌నెస్ కారణంగా కెప్టెన్సీ తో పాటు జట్టులోనూ చోటు కోల్పోయాడు. ఆ తర్వాత పీసీబీ .. 2020-21 సీజన్‌ కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను ప్రకటించగా.. మాజీ కెప్టెన్ క్యాటగిరీ 'బి' కి దిగజారాడాడు. గతేడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో సర్ఫరాజ్ క్యాటగిరీ 'ఏ' నుంచి 'బి'కి దిగజారింది. ఇక లాక్‌ డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఫిట్‌ నెస్ మెరుగుపర్చుకుని ఇంగ్లండ్ పర్యటనకి సెలెక్ట్ అయ్యాడు. సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్ పర్యటనకి ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.

దీనితో సిరీస్ మొత్తం రిజర్వ్ బెంచ్ ‌కే పరిమితమైయ్యాడు. ఇంగ్లండ్-పాక్ జట్ల మధ్య ఆదివారం రాత్రి రెండో టీ20 మ్యాచ్‌ ముగియగా రిజర్వ్ బెంచ్‌ పై కూర్చున్న సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కెమెరాకి చిక్కాడు. దాంతో మూడు ఫార్మాట్లలోనూ ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్‌ గా రికార్డ్ నెలకొల్పావంటూ సర్ఫరాజ్ ‌పై సోషల్ మీడియా లో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో తొలిసారి ఆవలింతలు తీస్తూ సర్ఫరాజ్ అహ్మద్ నెటిజన్ల చేతికి చిక్కాడు. మ్యాచ్‌‌లో విరాట్ కోహ్లీ వికెట్ల మధ్య వేగంతో పరుగు తీస్తుంటే.. వికెట్ల వెనుక ఉన్న సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కనిపించాడు. దీంతో పాక్ అభిమానులు కూడా దుమ్మెత్తిపోశారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్‌ని పూర్తిగా బెంచ్‌పైనే కూర్చోబెట్టేసింది. ఆ అప్పుడు కూడా మనోడు ఆవలింత తీసి అబాసుపాలయ్యాడు.