Begin typing your search above and press return to search.

మహిళపై జొమాటో డెలివరీ బాయ్ దాడి .. ట్విస్ట్ అదిరింది గురూ !

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 PM GMT
మహిళపై జొమాటో డెలివరీ బాయ్ దాడి .. ట్విస్ట్ అదిరింది గురూ !
X
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా మరో వివాదం లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బెంగుళూరు లో ఓ యువతి పై జొమాటో డెలివరీ యాప్ ఓ మహిళ పై దాడి చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియా ను షేక్ చేసింది. ఈ ఘటనపై జోమాటోకు, పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ఘటన పై స్పందించిన జోమాటో యాజమాన్యం, ఆమెకు క్షమాపణలు చెప్పడంతో పాటు భరోసా కల్పించింది. ఈ తరహా దాడులను తాము సహించమని, సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి, దానికి అనుగుణంగానే నిందితుడిపై చర్యలు కూడా తీసుకుంది. అయితే , ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

అదేమిటంటే .. నేను ఆ మహిళ పై దాడి చేయలేదు అని , ఆ మహిళనే తన ముక్కుపై తన ఉంగరంతోనే కొట్టికున్నట్టు చెబుతున్నాడు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్. దీనిపై వివరణ ఇస్తూ ఫుడ్ డెలివరీ బాయ్ ఏంచెప్పాడంటే .. నేను ఆమె అపార్ట్మెంట్ తలుపు వద్దకు చేరుకుని, ఆమెకు ఆహారాన్ని అందించాను. ట్రాఫిక్ మరియు రోడ్లు బాగా లేనందున డెలివరీ కాస్త ఆలస్యం అయ్యిందని ముందే చెప్పను , అలాగే ఆలస్యం అయినందుకు క్షమాపణలు కూడా చెప్పాను.

కానీ, ఆమె ఎందుకు ఆలస్యం అయ్యిదంటూ అరిచారు.. దానికి బదులుగా ట్రాఫిక్ జామ్, రోడ్ బాగలేదని చెప్పినా కూడా తనపై అరుస్తూనే ఆమె ఆర్డర్‌ ను తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించచిందని, బిల్లు చెల్లించాలంటూ తనను చాలా బ్రతిమిలాడాను అని , కానీ, ఆ మహిళ నన్న బానిస అని పిలవడం, ఆ తర్వాత ఆర్డర్ రద్దు చేశానని చెప్పిందని కానీ, ఆహారాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించిందని, ఆ సమయంలో నేను లిఫ్ట్ వైపు వెళ్తుండగా ఆమె హిందీలో బూతులు తిట్టారని, ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా నాపై చెప్పులు విసిరి కొట్టడం ప్రారంభించారని తెలిపారు.

అయితే, భద్రత కోసం, ఆమె నన్ను కొట్టినప్పుడు, నేను నా చేతులు అడ్డుపెట్టాను. కానీ, ఆమె నా చేతిని దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు.. అదే సమయంలో ఆమె ముక్కు మీద వేలు ఉంగరంతో తనను తాను కొట్టుకుంది. దీంతో రక్తస్రావం అయ్యిందని.. ఆమె ముఖాన్ని చూసిన ఎవరైనా ఇది ఎవరో కొట్టడం వళ్ల జరిగింది కాదని అర్థం చేసుకుంటారని తెలిపాడు. అసలు నేను ఉంగరాలు కూడా ధరించను అని చెప్పాడు. ఈ ఘటనపై ఢిల్లీలోని జోమాటో సపోర్ట్ సిస్టమ్ వ్యక్తి కూడా నాకు మద్దతుగా నిలిచాడని చెప్పాడు. అయితే , అక్కడ అసలు ఏం జరిగిందో మీ అందరికి చూపించడానికి అక్కడ సిసిటివి ఫుటేజ్ కూడా లేదని అసహనం వ్యక్తం చేశాడు.