Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్

By:  Tupaki Desk   |   22 Feb 2022 9:32 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్
X
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్ కు బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరుగనుంది.

ఇక నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో రిమాండ్ , వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు.మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ నలుగురికి సీబీఐ అభియోగ ప్రతాల వివరాలు అందించారు.

అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను కొంత ఆలస్యంగా పులివెందుల తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. శివ శంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితులను ఇటీవల గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసే పనిలో ఉంది. ముందుగా వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారించిన సీబీఐ అతని ద్వారా అసలు నిందితులెవరో రాబట్టింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ముందుగా ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. శంకర్ రెడ్డి ఐదో వ్యక్తిగా ఉన్నారు. వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంతో దర్యాప్తును వేగం చేసింది. ఇప్పటి వరకు ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరిలను అరెస్టు చేయగా వారు బెయిల్ పై బయటికొచ్చారు. అలాగే సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలను అరెస్టు చేయగా వారు జైలులో ఉన్నారు. తాజాగా శంకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. హత్యకేసుకు సంబంధించిన సీబీఐకి హైకోర్టు పలు ఆదేశాలను జారీ చేసింది. దిగువ కోర్టులో దాఖలు చేసిన సాక్సాలు, వాంగ్మూలాలు, విచారణ వివరాలు అప్పగించాలని తెలిపింది. వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతినిస్తూ కడప కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో హైకోర్టులో మరో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో కడప కోర్టులు జరిపిన విచారణ వివరాలు తమకు అందించాలని న్యాయమూర్తి కోరారు. తాజాగా ఈకేసును టేకప్ చేయడంతో కేసు మలుపుతిరిగింది.