Begin typing your search above and press return to search.

వికారాబాద్ కాల్పుల ఘటనలో ట్విస్ట్

By:  Tupaki Desk   |   1 Nov 2020 8:30 PM IST
వికారాబాద్ కాల్పుల ఘటనలో ట్విస్ట్
X
వికారాబాద్ లో కలకలం సృష్టించిన ఆవుపై కాల్పుల కేసు రాజకీయం రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దీనిపై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సదురు టెన్నిస్ స్టార్ కూడా స్పందించి ఖండించింది.

దుమారం రేపిన ఈ ఆవుపై కాల్పుల కేసును పరిగి పోలీసులు చేధించారు. ఆవుపై కాల్పులు జరిపిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ యజమాని ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లి కాల్పులకు పాల్పడినట్లు తేల్చారు.

ఇమ్రాన్ ఓపెన్ టాప్ జీప్ లో స్నేహితుడు అజహర్ ఉద్దీన్ తన రివాల్వర్ తో ఫైరింగ్ పాల్పడ్డాడు. రాత్రి సమయంలో జింక కళ్లు అని భావించి ఆవుపై కాల్పులు చేసినట్టు నిందితుడు అజహర్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

తన స్నేహితుడు ఇమ్రాన్, మెహబూబ్, రఫీ, రామచందర్ తో కలిసి వేటకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నలుగురిపై ఐపీసీతోపాటు ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు పరిగి పోలీసులు నమోదు చేశారు.